Skip to main content

పాఠకుల సందేహాలకు సమాధానాలు

స్ప్రింగ్ 2013 యు.ఎస్. యూనివర్సిటీ అడ్మిషన్‌కి   వీసా వచ్చింది. అయితే ఫాల్ 2013కి నా అడ్మిషన్‌ని డిఫర్ చేసుకున్నాను (వాయిదా వేసుకున్నాను).  స్ప్రింగ్ కోసం పొందిన వీసా మీద ఫాల్కి వెళ్లవచ్చా?
మీ అడ్మిషన్‌ని వాయిదా వేస్తూ (అదే యూనివర్సిటీ నుంచి) వచ్చిన కొత్త ఐ-20 మీద ఉన్న ‘సెవిస్’ నంబరులో మార్పు లేకుండా ఉంటే మీరు అదే వీసా మీద వెళ్లవచ్చు. మీరు కొత్త సెమిస్టర్‌లో కోర్సు మొదలుపెట్టడానికి ఆ యూనివర్సిటీ అనుమతి పొందినట్టు ధృవీకరించే సమాచారాన్ని దగ్గర ఉంచుకుని ఒకవేళ అడిగితే ‘పోర్ట్ ఆఫ్ ఎంట్రీ’లో చూపాలి.
నా వీసా ఇంటర్వ్యూ జరిగి నెలరోజులైంది. వీసా ఇవ్వలేదు. పాస్‌పోర్టు, డాక్యుమెంట్లు కాన్సులేట్ దగ్గరే ఉన్నాయి. యూనివర్సిటీ అడ్మిషన్ గడువు ఎక్స్‌టెన్షన్‌తో సహా దాటిపోయింది. వారిని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఒకవేళ ఇప్పుడు వీసా వస్తే ఇంకొక సెమిస్టర్‌కి వెళ్లి అదే యూనివర్సిటీలో చేరవచ్చా? 

మీ వీసా మీద నిర్ణయం జరిగిన వెంటనే కాన్సులేట్ నుంచి/వెబ్‌సైట్ ద్వారా మీకు సమాచారం అందుతుంది. ఇంకా అది రాలేదంటే నిర్ణయం జరగనట్టే భావించాలి. మీరు దీని పైన వారిని కాంటాక్ట్ చేయటం కాన్సులేట్ నిబంధనల ప్రకారం కుదరదు. వీసా ఇప్పుడు వచ్చినట్లయితే యూనివర్సిటీకి మీ పరిస్థితిని తెలియజేసి వారు అనుమతిస్తే అదే వీసా మీద వెళ్లవచ్చు (ఇతర వివరాలను పై ప్రశ్నకు ఇచ్చిన జవాబులో చూడండి).

మా అబ్బాయి యు.ఎస్. లో ఓ.పి.టి. మీద ఉన్నాడు. ఈ ఏప్రిల్‌లో హెచ్-1 అప్లయ్ చేసి మే నెలలో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయిన తర్వాత మా కోడలిని మా అబ్బాయి వెంట పంపడానికి ఏ వీసా అయితే తేలికగా వస్తుంది? 

తేలికగా వచ్చే వీసాలు కష్టంగా వచ్చే వీసాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. మీ అబ్బాయి ఓ.పి.టి. మీద ఉన్నప్పుడు ఎఫ్-1 మీద ఉంటారు కనుక ఆయన శ్రీమతికి ఎఫ్-2 (ఎఫ్ -1 డిపెండెంట్) వీసా కోసం; ఆయనకి ెహ చ్-1బి ఆమోదం పొందిన తర్వాత అయితే హెచ్-4 వీసా (హెచ్-1 డిపెండెంట్) కోసం అప్లయ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి, వివాహం చేసుకుని ‘స్పౌజ్’ని వెంట తీసుకెళ్లడానికి డిపెండెంట్ వీసా కేటగిరీలు ఉన్నప్పటికీ వాటిని మంజూరు చేయడానికి వివాహం మాత్రమే ఏకైక అర్హత కాదు. ఇద్దరికీ సంబంధించిన అనేక అంశాల్ని పరిశీలించిన తర్వాత మాత్రమే వీసా ఇస్తారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్నారు కనుక, అలాగే ఇంతకు పూర్వం తన వీసాని పొందిన అనుభవం ఉన్నవారు కనుక మీ అబ్బాయి తన ‘స్పౌజ్’ వీసాకి అప్లయ్ చేసేటప్పుడు అన్ని నిబంధనలని అర్థం చేసుకుని పాటించడానికి మంచి అవకాశం ఉంది.

అమెరికాలో ఎంఎస్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? 
మొదటగా అడ్మిషన్‌లకి సంబంధించిన సమాచారం కోసం ‘హలో అమెరికా’లో ఇప్పటికి నేను రాసిన పలు వ్యాసాలను ఇక్కడ ఇస్తున్న ‘సాక్షి’ ఆర్కైవ్స్ వెబ్‌లింక్‌లో చూడండి. ఆ తర్వాత మీరు ఎంచుకునే ఒక్కో యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోకి వెళితే ఏకోర్సుకి ఎంత ఖర్చయ్యేదీ వివరంగా తెలుస్తుంది. యు.ఎస్. యూనివర్సిటీలు వేటి నిబంధనలను అవే ఏర్పరచుకున్నట్టుగానే వేటి ఫీజులను అవే నిర్ణయించుకుంటాయి. అలాగే లివింగ్ ఎక్స్‌పెన్సులు అమెరికాలో ఒక్కోప్రాంతంలో ఒక్కోరకంగా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ వెబ్‌సైటు మీకు ఈ విషయాలలో ఎంతో ఉపయుక్తమైన సమాచారాన్నిస్తుంది. https://www.sakshi.com/Main/DailyStory.aspx?categoryid=30&subcatid=0

Published date : 02 Feb 2013 01:45PM

Photo Stories