పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు
Sakshi Education
నేనిక్కడ బయోకెమిస్ట్రీ మాస్టర్స్ చేశాను. 10 ఏళ్లుగా ఫార్మా కంపెనీలలో పనిచేస్తున్నాను. అమెరికాలో ఫార్మా మేనేజ్‌మెంట్‌లో డిప్ల్లమా ఏదైనా చేసి తర్వాత ఉద్యోగం చూసుకుని అక్కడే సెటిల్ అవ్వడం కుదురుతుందా?
- ఖలీల్ అహ్మద్
పదేళ్లపాటు పనిచేసిన తర్వాత మళ్లీ చదువుకుని జీవితంలో ఇంకొక దశలోకి ప్రవేశించాలనుకుంటున్న మీ దీక్షకు ముందుగా అభినందనలు. అయితే అమెరికాలో విదేశీయులకు ఇచ్చే తాత్కాలిక ఉద్యోగాలు అన్నీ కూడా అక్కడ స్థానికంగా అంత తేలికగా లభించని స్పెషాలిటీ విభాగాల నిపుణులకు మాత్రమే దక్కుతాయి. ఆ రకంగా చూస్తే మీరు అక్కడ పీహెచ్‌డీ చెయ్యడం వల్ల మీరు కోరుకుంటున్న ఫలితం పొందవచ్చునేమో గాని డిప్లమా వల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కొంతమంది ఎఫ్-1 స్టూడెంట్ వీసా మీద వెళ్లి కాలక్రమంలో మారిన ప్రాధాన్యాల వల్ల, అందివచ్చిన అవకాశాల వల్ల ఎం.ఎస్. అవగానే ముందుగా అనుకున్నట్టుగా ఇండియాకి తిరిగి రాకుండా అక్కడే పీహెచ్‌డీ లో చేరతారు. పీహెచ్‌డీ చేసినవారికి అమెరికాలో ఉద్యోగ అవకాశాలు, గ్రీన్ కార్డు అవకాశాలు సులభం. అయితే మీ విషయానికి వస్తే... మీరు అమెరికాలో ఏదోవిధంగా స్థిరపడిపోయే ఉద్దేశంతోనే అక్కడికి పై చదువుకు వెళ్లాలనుకుంటున్నారు కనుక మీకు అక్కడ ఏదో ఒక కోర్సులో ప్రవేశం లభించినా ఇక్కడి అమెరికన్ కాన్సులేట్‌ల నుంచి మీకు వీసా లభించకపోవచ్చు. ఎందుకంటే, స్టూడెంట్ వీసాలు అనేవి యు.ఎస్.లో చదువుకుని మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చే నాన్-ఇమిగ్రెంట్ల కోసం ఉద్దేశించినవే గాని స్థిరపడే ఉద్దేశంతో వెళ్లే ఇమిగ్రెంట్‌లకి ఉద్దేశించినవి కావు.
నాకు అయిదేళ్లకు సి-1/డి వీసా ఉంది. ఈ వీసాతో నేను అమెరికాలో జాబ్ చెయ్యవచ్చా?
- మహేష్
చెయ్యకూడదు. ఇక్కడి నుంచి మరొక దేశానికి వెళుతున్నప్పుడు ప్రయాణ మార్గం ప్రకారం మధ్యలో అమెరికాలో ఆగి ప్రయాణించవలసిన అవసరం ఉన్నవారికి సి-1 వీసా ఇస్తారు. వెళ్లింది ఫ్లయిట్‌లో అయినా, షిప్‌లో అయినా 29 రోజులు దాటకముందే అమెరికాని విడిచి తుది గమ్యానికి వెళ్లిపోవాలి. సి-1 మీద వెళ్లి అమెరికాలో మరొక నాన్-ఇమిగ్రెంట్ వీసాకి మారడానికి గాని; అక్కడ విద్యాభ్యాసం, ఉద్యోగం చెయ్యడానికి గాని వీలు లేదు. ఇక డి-1 ‘క్రూ-మెన్’ వీసా అనేది అమెరికా చేరుకునే విమానం లేదా నౌకలో పనిచేసే విదేశీయులు అమెరికాలో ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. ఈ వీసా మీద వెళ్లేవారు కూడా అక్కడ ఇంకొక వీసాకి మారడానికి లేదా అక్కడ వేరే ఉద్యోగం చేయడానికి వీలు లేదు. యు.ఎస్.లో తాత్కాలిక ఉద్యోగం చేయాలంటే అమెరికాలోని ఒక ఎంప్లాయర్ మీకు ఉద్యోగం ఇచ్చి మీ తరఫున హెచ్-1 బి పిటిషన్ పెట్టి దానికి అప్రూవల్ పొందాలి. అమెరికా నూటికి నూరుశాతం నిబంధనలను పాటించే దేశం. మినహాయింపులుగాని, చూసీచూడనట్టు వదిలేయ డం గాని అక్కడ ఉండదు. అక్కడ ఉద్యోగం చేయడానికి ఉద్దేశించని వీసా మీద వెళ్లినవారు ఆ దేశంలో పనిచేయడానికి ప్రయత్నించడాన్ని తీవ్రమైన నేరంగా భావిస్తారు.

Published date : 16 Feb 2013 01:35PM