Skip to main content

ఒక వీసా నుంచి మరొక వీసాకి ఎవరు మారవచ్చు?

అమెరికా వెళ్లిన తర్వాత అవసరమైతే ఒక వీసా నుంచి ఇంకొక వీసాకి ఎవరు మారవచ్చు?

యు.ఎస్. చేరుకున్న తర్వాత అక్కడ కాలక్రమంలో మారిన వ్యక్తిగత ప్రాధాన్యాలు లేదా పరిస్థితుల వల్ల కొందరు తమ వీసా స్టేటస్‌ని ఒక కేటగిరీ నుంచి

మరొక కేటగిరీకి మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. టూరిస్టుగా వెళ్లిన వ్యక్తి స్టూడెంటుగా మారాలనుకుంటాడు. స్టూడెంట్‌గా వెళ్లినవారే తాత్కాలిక

ఉద్యోగులుగా మారాలనుకుంటారు. యు.ఎస్. వ్యవస్థ కూడా కొన్ని నిబంధనలకు, పరిమితులకు లోబడి కొన్ని కేటగిరీల వారి నాన్-ఇమ్మిగ్రెంట్ స్టేటస్‌లో

మార్పులకు అనుమతిస్తోంది. ముందుగా ఏ వీసా కేటగిరీలలో మార్పునకు అనుమతించడం కుదరదో తెలుసుకుందాం.

ఎం-1 మీద వెళ్లిన వారు (వొకేషనల్ స్టూడెంట్స్) ఎఫ్-1 ఫుల్ టైమ్ అకాడమిక్ స్టూడెంట్ వీసాకి లేదా హెచ్-1 (టెంపొరరీ వర్కర్) వీసాకి మారడానికి

వీలులేదు.

జె-1 ఎక్స్‌చేంజ్ విజిటర్లు స్పెషల్ వైవర్ పొందిన సందర్భాలలో తప్ప తమ స్టేటస్‌ని మార్చుకోవడం కుదరదు.

టూరిస్టు వీసా (బి-2) నుంచి స్టూడెంట్ వీసా (ఎఫ్-1) కి మారకూడదనే నిబంధనలేకపోయినా అది దాదాపుగా దుర్లభమని ‘హలో అమెరికా’లో

ఇప్పటికే మనం చెప్పుకున్నాం.

‘క్రూ మెంబర్’ డి-వీసా, ‘ట్రాన్సిట్’ సి-వీసా, యు.ఎస్. సిటిజన్ ఫియాన్సీ లేదా ఫియాన్సీ డిపెండెంట్ల ‘కె’ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల నుంచి ఇంకొక

కేటగిరీకి మారడం కుదరదు.

ఐ-94 గడువు తీరకముందే స్టేటస్ మార్పుకోసం యు.ఎస్.సి.ఐ.ఎస్. (యు.ఎస్.సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్)కి దరఖాస్తు చేసుకోవాలి (ఐ-

94 అంటే మీరు యు.ఎస్.లోకి ప్రవేశించేటప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు మీకు ఇచ్చే అనుమతి పత్రం. అదే మీ అసలైన వీసా).

స్టేటస్ మార్పుకోసం దరఖాస్తు చేసుకున్నవారు యు.ఎస్.సి.ఐ.ఎస్. నుంచి నిర్ణయం వెలువడే వరకు తాము ఆశిస్తున్న కొత్తస్టేటస్ పరిధిలోకి వచ్చే

పనులేవీ చెయ్యకూడదు. అలా చేస్తే ఉన్న స్టేటస్‌కి ముప్పు వచ్చి అమెరికా నుంచి వెళ్లిపోవలసిన పరిస్థితి రావచ్చు.

బి-1 మీద వెళ్లిన బిజినెస్ విజిటర్లు తమ పనులు పూర్తయిన తర్వాత టూరిస్టుగా గడపాలంటే తమ స్టేటస్‌ని బి-2 కి మార్చుకోనవసరం లేదు. అయితే

వారి బి-1, బి-2 వీసాల పరిధిలోకి వచ్చే కార్యక్రమాలన్నీ కూడా వారి ఐ-94 మీద ఉన్న తుదిగడువులోగానే పూర్తి కావాలి.

ఎ-వీసా (డిప్లొమాటిక్, గవర్మెంట్), జి-వీసా (అంతర్జాతీయ సంస్థలు), హెచ్-వీసా (తాత్కాలిక ఉద్యోగులు), ఐ- వీసా (విదేశీ మీడియా ప్రతినిధులు);

జె-వీసా మీద ఉన్నవారి డిపెండెంట్లు అమెరికాలో చదువుకోవాలనుకున్నప్పుడు తమ వీసా కేటగిరీని మార్చుకోనవసరం లేదు

Published date : 18 Jan 2013 03:52PM

Photo Stories