ఇన్ఫోటిక్ కోర్సులలో ఆన్-లైన్ మాస్టర్స్ డిగ్రీలు
యు.ఎస్.లో ఆన్-లైన్ గ్రాడ్యుయేట్ (మాస్టర్స్) కోర్సులకు మొదటి పది (టాప్) ర్యాంక్‌లు పొందిన కొన్ని అగ్రశ్రేణి/అక్రెడిటెడ్ యూనివర్సిటీలు ఇచ్చే ఇన్ఫోటిక్ డి గ్రీలను గురించి ఇవాళ చూద్దాం.
1వ స్థానం: యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (లాస్ ఏంజిలిస్, సి.ఏ.) ఒక ప్రయివేట్ యూనివర్సిటీ. కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మల్టీ మీడియా అండ్ క్రియేటివ్ టెక్నాలజీస్; సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్స్ సిస్టమ్స్ నెట్ వర్కింగ్ అండ్ టెలి కమ్యునికేషన్స్, గ్రాఫిక్స్ డిజైన్ లాంటి 39 కోర్సులు అక్కడ ఆన్-లైన్ ద్వారా విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్‌లకు తుది గడువు జనవరి 15తో అయిపోయింది. ట్యూషన్ ఫీజు (ఒక్కో క్రెడిట్‌కి) 1,569 డాలర్లు. జి.ఆర్.ఇ., టోఫెల్ స్కోర్లు కావాలి. రెండున్నర ఏళ్లలో మాస్టర్స్ పూర్తవుతుంది.
2వ స్థానం: శామ్ హ్యుస్టన్ స్టేట్ యూనివర్సిటీ (హాంట్స్ విల్, టెక్సాస్). పబ్లిక్/రోలింగ్ అడ్మిషన్లు (ఏడాది పొడుగునా ఎప్పుడైనా అప్లయ్ చేయవచ్చు)/237 డాలర్లు/జి.ఆర్.ఇ., టోఫెల్.
3వ స్థానం: వర్జీనియా టెక్ (బ్లాక్స్ బర్గ్ వర్జీనియా). పబ్లిక్/రోలింగ్/ 1,246 డాలర్లు/టోఫెల్
4వ స్థానం: యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్ పోర్ట్ (బ్రిడ్జ్ పోర్ట్, సి.టి.) ప్రయివేట్/రోలింగ్/700 డాలర్లు/టోఫెల్
5వ స్థానం: పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ-వరల్డ్ క్యాంప స్ (యూనివర్సిటీ పార్క్, పి.ఏ.). పబ్లిక్/మే 15/ 825 డాలర్లు/జి.ఆర్.ఇ., టోఫెల్.
6వ స్థానం: యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా (కరోలిటన్ జి.ఏ.) పబ్లిక్/రోలింగ్/ 377 డాలర్లు/జి.ఆర్.ఇ.
7వ స్థానం: ఆబర్న్ యూనివర్సిటీ (ఆబర్న్, ఏ.ఎల్.). రోలింగ్/674 డాలర్లు/జి.ఆర్.ఇ., టోఫెల్.
8వ స్థానం: కొలంబియా యూనివర్సిటీ (న్యూయార్క్, ఎన్.వై.). ప్రయివేట్/రోలింగ్/1,578 డాలర్లు/జి.ఆర్.ఇ., టోఫెల్.
9వ స్థానం: నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ (ర్యాలీ, ఎన్.సి.) పబ్లిక్/726 డాలర్లు/జి.ఆర్.ఇ., టోఫెల్.
10వ స్థానం: హాఫ్ స్త్రా యూనివర్సిటీ (హెంప్ స్టెడ్, ఎన్.వై.). ప్రయివేట్/రోలింగ్/1,080 డాలర్లు/జి.ఆర్.ఇ., టోఫెల్.