Skip to main content

అనేక రకాల వీసాలతో అమెరికాకు రాజమార్గం

అమెరికా మంజూరు చేసే అనేకరకాల వీసాలలో నాన్-ఇమిగ్రెంట్ కేటగిరీ వీసాలు అమెరికాలో తాత్కాలికమైన పనుల మీద వెళ్లేవారికి ఉద్దేశించినవి కాగా,

ఇమిగ్రెంట్ శ్రేణి వీసాలు అక్కడ శాశ్వతంగా స్థిరపడేవారికి సంబంధించినవి. కాగా మరికొన్ని వర్తించినా జన బాహుళ్యానికి అంతగా పరిచయం లేనివి

ఉన్నాయి. ఒక్కోరకం పనిమీద వెళ్లేవారికి ఒక్కోరకం వీసా. ఒక్కోరకం వీసాకి ఒక్కోరకం నిబంధనలు. ఇదీ నాన్-ఇమిగ్రెంట్ వీసాల మొదటి ప్రత్యేకత.

బి-1 వీసా: అమెరికాలో ఏదైనా బిజినెస్ మీటింగ్‌కి, కాన్ఫరెన్స్‌కి వెళ్లేవారు బి-1కి అప్లై చేసుకోవచ్చు. అయితే బిజినెస్ వీసా అనగానే దీని మీద

యు.ఎస్.లో ఉండిపోయి, ఎంచక్కా అక్కడ వ్యాపారం (వాణిజ్యం) నడుపుకోవచ్చని అర్థం కాదు. ఇక్కడ ‘బిజినెస్’ అంటే ‘వ్యవహారం’ మాత్రమే అని

భావించాలి. మనకి సర్వసాధారణంగా తెలిసిన బిజినెస్ విజిటర్లే కాక ఇంకా పర్సనల్/డొమెస్టిక్ ఎంప్లాయిస్, ప్రైజ్ మనీ కోసం పోటీపడే క్రీడాకారులు,

అమెచ్యూర్స్, ప్రొఫెషనల్స్ లాంటివారు కూడా బి-1 కేటగిరీ కిందికి వస్తారు.

బి-2 వీసా: ఇది టూరిస్టు లేదా విజిటర్ వీసా. యు.ఎస్.లో టూరిస్టుగా వివిధ ప్రదేశాలు సందర్శించటం, హాలిడే గడపటం, బంధుమిత్రులతో ఉండటం,

విశ్రాంతి పొందటం, అవినాభావ, సామాజిక సేవా కార్యక్రమాలకు హాజరవ్వటం, పారితోషికం లేకుండా సంగీతం, క్రీడలు లాంటి వాటిలో ఔత్సాహికులు

పాల్గొనడం లాంటివి బి-2 కిందికి వస్తాయి.

ఎఫ్-1, ఎం-1 వీసాలు: ఇవి విద్యార్థి వీసాలు. ఫుల్ టైమ్ అకడెమిక్ కోర్సుల్లో చేరేవారికి ఎఫ్-1 వీసా, నాన్-అకడెమిక్ లేదా వృత్తి విద్యా సర్టిఫికేషన్లు

పొందేవారికి ఎం-1 వీసాలు అవసరం.

హెచ్-1 వీసా: ఇది అమెరికాలో తాత్కాలిక ఉద్యోగాలు చేసేవారికి ఇచ్చే వీసా. అక్కడ నాన్-ఇమిగ్రెంట్లు తాత్కాలిక ఉద్యోగాలకు మాత్రమే అర్హులు. శాశ్వత

ఉద్యోగాలు గ్రీన్ కార్డులు ఉన్నవారికి, సిటిజన్లకి మాత్రమే లభిస్తాయి. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం సిటిజన్లకి మాత్రమే ఇస్తారు. అత్యుత్తమమైన

ప్రత్యేక పరిజ్ఞానం అవసరమైన స్పెషాలిటీ ఆక్యుపేషన్స్‌లో పనిచేసేవారికి హెచ్-1బి ఇస్తారు. దీనిమీద ఇండియా నుంచి వెళ్లాలంటే మొదటగా యు.ఎస్.లో

పిటిషన్ ఆమోదం పొందాలి.

ఎల్ వీసా: ఇండియా నుంచి ఒక మల్టీనేషనల్ కంపెనీ తన వద్ద మేనేజీరియల్, ఎగ్జిక్యూటివ్, స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కెపాసిటీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని

అమెరికాలోని తన విభాగానికి, అనుబంధసంస్థకి (కంపెనీ లోపలే) ఇంట్రా-కంపెనీ ట్రాన్స్‌ఫర్ చెయ్యడానికి ఎల్-వీసాలు అవకాశం కల్పిస్తాయి.

ఇంకా ఎక్స్‌ఛేంజ్ విజిటర్లకి జే వీసాలు; అమెరికా నుంచి కవరేజ్ కోసం వెళ్లే మీడియా ప్రతినిధులకు ఐ-వీసా (అమెరికాలో పిటిషన్‌తో పని లేకుండా

ఇండియాలోనే ఇస్తారు); లలితకళలు, సినిమా, టెలివిజన్, శాస్త్రవిజ్ఞానం, క్రీడా రంగాలలో అసాధారణ ప్రతిభ గల విదేశీయులకు ఓ-వీసా (అమెరికాలో

అప్రూవ్ అయిన పిటిషన్‌తో ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్లాలి); అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఎంటర్‌టైన్‌మెంట్ బృందం సభ్యులు, క్రీడాకారులకి పి-1;

ఇచ్చిపుచ్చుకునే ఏర్పాటు కింద ఒక మార్పిడి కార్యక్రమంలో పాల్గొనే కళాకారులు, ఎంటర్‌టైనర్లకి పి-2 వీసా; సాంస్కృతికంగా విలక్షణమైన ఒక కార్యక్రమంలో ప్రదర్శనలిచ్చే కళాకారులు, ఎంటర్‌టైనర్లకి పి-3 వీసా ఉన్నాయి. మత సంబంధమైన ఆర్-వీసా, అమెరికా మీదుగా మరోదేశానికి ప్రయాణించేవారికి ట్రాన్సిట్-సి వీసా; అమెరికాలో ఒక నౌక లేదా విమానం మీద పనిచేసే ‘క్రూ మెంబర్’ల కోసం డి-వీసాలు కూడా నాన్-ఇమిగ్రెంట్ కేటగిరీలో ఉన్నాయి.

Published date : 18 Jan 2013 03:55PM

Photo Stories