ఐదు నెలల విరామంతో కథ మళ్లీ మొదటికి!
యు.ఎస్.లో చదువుతూ ఇండియా వెళ్లినప్పుడు 5నెలలకి మించి అమెరికా వెలుపల ఉంటే ఇబ్బందిలో పడవచ్చని ఒక సందర్భంలో చెప్పారు. అలా 5నెలలు యు.ఎస్. వెలుపల ఉన్న విద్యార్థికి స్టేటస్ సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎలా వస్తాయో ఇంకాస్త వివరంగా చెబుతారా?
బాల్లిమోర్ (మోరీలాండ్)లోని ఒక అగ్రశ్రేణి యు.ఎస్. పబ్లిక్ యూనివర్శిటీ దీనికి సంబంధించి ఏం చెప్పిందో చూస్తే మీ ప్రశ్నకి చాలావరకు సాధికారిక సమాధానం దొరుకుతుంది.
మొదటగా ఐదు నెలలకి మించి యు.ఎస్. బయట ఉన్న విద్యార్థి తన ఎఫ్-1కి సంబంధించి కొత్త ఐ-20తో, కొత్త వీసా స్టాంపుతో, కొత్త ఎఫ్-1 స్టేటస్‌ని ప్రారంభించ వలసి వస్తుంది.
ఇతర ఇబ్బందులలోకి వెళితే- ఫామ్ ఐ-901ని ఫైల్ చేసి ‘సెవిస్’ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. యూనివర్శిటీ మళ్లీ కొత్తగా ఐ-20 ఇవ్వాలంటే మీరు సమర్పించే ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు 12గత నెలలలోగా తీసుకున్నవి అయి ఉండాలి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రై నింగ్‌తో సహా ఏ తరహా ‘‘ఆఫ్-క్యాంపస్’’ వర్క్ ఆథరైజేషన్ పొందడానికైనా మళ్లీ అర్హత సంపాదించుకోవడానికి ఇంకొక అకాడమిక్
ఇయర్ పాటు ఆగవలసి ఉంటుంది. అంటే కథ మళ్లీ మొదటికొస్తుందన్నమాట. డిగ్రీ ప్రోగ్రాం ముగింపు దశలో ఉండగా ఐదు నెలలకంటే ఎక్కువకాలం యు.ఎస్. వెలుపల ఉండవలసిన అవసరం ఉన్నవారు యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్వయిజర్ సలహాని ముందుగా తీసుకోవడం అవసరం.
ఐదు నెలలు ఇండియాలో ఉన్న తర్వాత వీసా ఫార్మాలిటీస్ లాంటివన్నీ ముగించుకుని మళ్లీ యు.ఎస్. యూనివర్శిటీలో తిరిగి విద్యాభ్యాసానికి
వెళ్లేటప్పుడు వారు యూనివర్శిటీలో ఎటువంటి రిక్వయిర్మెంట్లు పూర్తి చేయ్యాలంటే మునుపటి సెమిస్టర్‌కి నమోదయి ఉండకపోతే ‘రీ-అడ్మిషన్ల’ ఆఫీసులో
‘రీ-ఎన్ రోల్ మెంట్ కి’ విజ్ఞప్తి చేసుకోవాలి.
యు.ఎస్.లో విద్యాభ్యాసానికి వెళ్లిన విదేశీ విద్యార్థులెవ్వరూ చేజేతులా సమస్యలు తెచ్చుకోవాలనుకోరు. తప్పనిసరి పరిస్థితుల లోనే ఎవరైనా సరే చదువు
మధ్యలో స్వదేశానికి వెళ్లి ఐదు నెలలకు మించిన కాలాన్ని గడుపుతారు. అయితే ఈ పరిస్థితులను చాకచక్యంగా నియంత్రించడం కోసం సక్సెస్‌కి తారకమంత్రం ఉంటుందనేది నిజం. 5 నెలలకు మించి యు.ఎస్. వెలుపల ఉండక తప్పని సరిస్థితి ఏర్పడినప్పుడు మన విద్యార్థులు యూనివర్శిటీ
అధికారులను ముందుగానే సంప్రదించి నిబంధనల ప్రకారమే ప్రతి అడుగు ముందుకు వేయడం మంచిది.