H-1B Visas: అమెరికాలోనే హెచ్–1బీ వీసాల రెన్యూవల్
హెచ్–1బీ వీసాల రెన్యూవల్ (స్టాంపింగ్) కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, అమెరికాలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని కేటగిరీల్లో హెచ్–1బీ వీసాలకు డొమెస్టిక్ రెన్యూవల్ ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
అమెరికాలో పెద్ద సంఖ్యలో భారత ఐటీ నిపుణులు హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజా నిర్ణయంతో వీరికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వ్యయ ప్రయాసలు తప్పుతాయి. అయితే, తొలి దశలో 20,000 మందికే ఈ వెసులుబాటు కలి్పంచనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత దశల వారీగా మరికొంతమందికి అవకాశం కలి్పస్తారు.
చదవండి: Changes in H1-B Visa Process: మార్పులు ఇవే... ఎవరికి లాభమంటే
డిసెంబర్ నుంచి మూడు నెలల్లోగా హెచ్–1బీ వీసా గడువు ముగిసేవారు వీసా రెన్యూవల్ (స్టాంపింగ్)ను అమెరికాలోనే చేసుకోవచ్చు. అమెరికా వీసాలకు భారత్‌లో భారీ డిమాండ్ ఉందని జూలీ స్టఫ్ట్ గుర్తుచేశారు. వీసా కోసం కొన్ని సందర్భాల్లో ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వస్తోందని చెప్పారు. భారతీయులకు సాధ్యమైనంత త్వరగా వీసా అపాయింట్‌మెంట్లు ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. ఇందులో ఒక మార్గంగా డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దీనివల్ల భారతీయ టెకీలకు లబ్ధి కలుగుతుందన్నారు
మనవారికి 1.4 లక్షల వీసాలు
2022లో భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో 1.4 లక్షలకుపైగా వీసాలు జారీ చేసినట్లు స్టఫ్ట్ వెల్లడించారు. అమెరికా వర్సిటీల్లో తరగతుల ప్రారంభానికి ముందే భారత్‌లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేయడానికి సిబ్బంది కొన్నిసార్లు వారమంతా పనిచేస్తున్నారని తెలిపారు.
చదవండి: Green Card backlog: లక్షల మంది భారతీయ పిల్లలు తల్లిదండ్రులకు దూరం.. ఎందుకంటే!