Educational Testing Service: జీఆర్‌ఈ పరీక్ష ఇకపై ఇన్ని గంటల్లోనే పూర్తి చేయొచ్చు
పరీక్ష కాల వ్యవధిని తగ్గిస్తున్నట్లు జూన్ 1న ప్రకటించింది. ప్రస్తుతం జీఈఆర్ జనరల్ టెస్టు వ్యవధి 3.45 గంటలు. ఇకపై 1.58 గంటల్లోనే పరీక్ష పూర్తి చేయొచ్చు. అధికారిక స్కోర్ తెలుసుకోవానికి 15 రోజుల సమయం పడుతోంది. 2023 సెప్టెంబర్ నుంచి రెండు గంటల్లోపే జీఆర్‌ఈ జనరల్ టెస్టు పూర్తి కానుంది. అంటే ఇప్పుడున్న వ్యవధితో పోలిస్తే సగం తగ్గింది. అలాగే పరీక్ష పూర్తయిన తర్వాత 10 రోజుల్లోగానే అభ్యర్థులు తమ అధికారిక స్కోర్‌ను తెలుసుకోవచ్చని ఈటీఎస్ వెల్లడించింది.
చదవండి: జీఆర్‌ఈ పరీక్ష గురించి వివరించండి?
అనలైటికల్ రైటింగ్ సెక్షన్‌లో ‘అనాలిసిస్ యాన్ ఆర్గ్యుమెంట్’ టాస్క్‌ను తొలగిస్తున్నట్లు తెలియజేసింది. క్వాంటిటేటివ్, వెర్బల్ రీజనింగ్‌లో ప్రశ్నల సంఖ్యను తగ్గిస్తున్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 22 నుంచి జీఆర్‌ఈ పరీక్ష ప్రారంభం కానుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. జీఆర్‌ఈ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్యలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. 2021–22లో అమెరికాలో 1.24 లక్షల మంది, భారత్‌లో 1.14 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని ఉన్నత విద్యాసంస్థలు జీఆర్‌ఈ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
చదవండి: TOEFL Exam: ‘టోఫెల్’ పరీక్ష కాల వ్యవధి గంట తగ్గింపు.. జూలై 26 నుంచి అమల్లోకి..