ఆస్ట్రేలియాలో ‘ఎంఎస్’ చేరేందుకు సులువైన మార్గాలు...
Sakshi Education
విదేశాల్లో ఉన్నత విద్య.. చాలామంది మన విద్యార్థుల లక్ష్యం. ఏ దేశంలో చదివితే బెస్ట్..? ఎక్కడ పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు బాగుంటాయో తెలుసుకునేందుకు అన్వేషణ ప్రారంభిస్తారు. ఇటీవల కాలంలో అమెరికా, బ్రిటన్ తర్వాత విదేశీ విద్య ఔత్సాహికులకు.. చక్కటి గమ్యంగా నిలుస్తున్న దేశం.. ఆస్ట్రేలియా! ముఖ్యంగా అక్కడి యూనివర్సిటీల్లోని.. ఎంఎస్ ప్రోగ్రామ్‌లలో చేరేందుకు మన విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు! ఈ నేపథ్యంలో.. ఆస్ట్రేలియాలో ఎంఎస్ కోర్సులకు దరఖాస్తు విధానం.. అర్హతలు.. వీసా జాగ్రత్తలు.. పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
ఆస్ట్రేలియా.. విదేశీ విద్య పరంగా అంతర్జాతీయంగా టాప్-3 జాబితాలో నిలుస్తున్న దేశం. వాస్తవానికి స్టడీ అబ్రాడ్ అనగానే అమెరికా, యూకేలే గుర్తొస్తాయి. ఇటీవల కాలంలో అమెరికాలో కఠిన నిబంధనలు, యూకేలో బ్రెగ్జిట్ అనిశ్చితి వంటి కారణాలతో.. ఆస్ట్రేలియా వైపు దృష్టిసారిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా ఇక్కడి యూనివర్సిటీలకు అంతర్జాతీయంగా లభిస్తున్న గుర్తింపు, సరళీకృత వీసా విధానాలు, విద్యా ప్రమాణాలు, పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు.. అంతర్జాతీయంగా విద్యార్థులు ఆస్ట్రేలియావైపు ఆకర్షితులయ్యేలా చేస్తోంది. అలాగే అమెరికా, బ్రిటన్ వంటి ఇతర దేశాలతో పోల్చితే ఆస్ట్రేలియాలో కొంత తక్కువ ఖర్చుతోనే కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ప్రపంచంలో ‘బెస్ట్-30 సిటీస్ ఫర్ లెర్నింగ్’ జాబితాలో అయిదు నగరాలు ఆస్ట్రేలియాలోనే ఉండటం మరో ప్రధాన అనుకూలాంశంగా నిలుస్తోంది.
భారత్ నుంచి ఎంఎస్ కోర్సులకే..
అమెరికా తర్వాత మరో ప్రధాన గమ్యంగా భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాను ఎంచుకుంటున్నట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఆస్ట్రేలియన్ హై కమిషన్ గణాంకాల ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో భారత్ నుంచి మొత్తంగా 1,07,673 మంది ఆస్ట్రేలియాలోని ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశం పొందారు. 2019 చివరి నాటికి మొత్తం 6,31,935 మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతుంటే.. వారిలో ఒక్క భారత్ నుంచే 1,20,913 మంది ఉండటం విశేషం.
అర్హతలు :
ఆ దేశ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే.. దరఖాస్తు మొదలు వీసా పొందే వరకు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులు ముందుగా అక్కడి యూనివర్సిటీలు అమలు చేస్తున్న అర్హత నిబంధనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశానికి ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా పేర్కొంటున్నాయి. నిర్దిష్టంగా కొన్ని కోర్సులకు మాత్రం పదహారేళ్ల విద్యాభ్యాసం(10+2+4)విధానాన్ని, నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ అర్హత విధానాన్ని అమలు చేస్తున్నాయి.
సర్టిఫికెట్లు :
ఆస్ట్రేలియాలో పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్స్‌తోపాటు సెకండరీ స్కూల్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా జత చేయాలి. ఎంబీఏ, డాక్టోరల్ ప్రోగ్రామ్‌ల్లో చేరాలనుకునే అభ్యర్థులు.. అర్హతలు, పని అనుభవం వంటి పూర్తి వివరాలతో ‘సీవీ’ని అందించాల్సి ఉంటుంది. అదే విధంగా స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్(ఎస్‌ఓపీ), లెటర్ ఆఫ్ రికమండేషన్‌లు(ఎల్‌ఓఆర్) కూడా దరఖాస్తుతోపాటు జత చేయాలి.
టెస్ట్ స్కోర్లు తప్పనిసరి..
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి.. స్టాండర్డ్ లాంగ్వేజ్ టెస్ట్ స్కోర్లు తప్పనిసరి. విద్యార్థులు ఐఈఎల్‌టీఎస్ లేదా పీటీఈ లేదా టోఫెల్‌లలో ఏదో ఒక లాంగ్వేజ్ టెస్ట్‌లో నిర్దిష్ట స్కోర్లు సొంతం చేసుకోవాలి. ఎంబీఏ కోర్సులో ప్రవేశం కోసం కొన్ని యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్‌ను అడుగుతున్నాయి.
రెండేళ్ల కోర్సు మేలు :
ఆస్ట్రేలియాలో ఎంఎస్ ప్రోగ్రామ్‌ల కాల వ్యవధి కనిష్టంగా ఏడాది నుంచి గరిష్టంగా రెండేళ్ల వరకూ ఉంటోంది. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ సొంతం చేసుకునేందుకు రెండేళ్ల వ్యవధిలో ఉండే ఎంఎస్ కోర్సులో చేరడం మేలు. ప్రస్తుత నిబంధనల ప్రకారం- రెండేళ్ల వ్యవధిలోని ఎంఎస్ ప్రోగ్రామ్ లేదా డిప్లొమా ప్రోగ్రామ్ లేదా బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లు పూర్తిచేసుకున్న వారే అక్కడ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కాబట్టి విద్యార్థులు రెండేళ్ల వ్యవధిలోని ఎంఎస్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేయడానికే ప్రాధాన్యమివ్వాలి.
ఫీజులు.. అనుకూలంగా..
ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య పరంగా కలిసొచ్చే అంశం.. ట్యూషన్ ఫీజులు కాసింత తక్కువగా ఉండటం. యూనివర్సిటీ లేదా కాలేజ్ స్థాయి, ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా.. 20 వేల నుంచి 37 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు ట్యూషన్ ఫీజుగా ఉంటుంది. అలాగే నివాస ఖర్చుల కోసం ఏడాదికి 20,290 ఆస్ట్రేలియన్ డాలర్లు తమ వద్ద ఉన్నట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్స్ చూపించాలి.
వీసా కోసం :
ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసా పొందాలనుకునే విద్యార్థులకు అయిదు అంశాలపై స్పష్టత ఉండాలి.
అవి...
1. అడ్మిషన్‌కు దరఖాస్తు
2. ఫైనాన్షియల్ ఎవిడెన్స్
3. ట్యూషన్ ఫీజు, యూనివర్సిటీలో ఎన్‌రోల్‌మెంట్
4. మెడికల్ ఎగ్జామినేషన్
5. వీసా లాడ్జ్‌మెంట్.
తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులకు అనుకూలమైనస్టడీ వీసా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అడిషనల్ టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా అనే కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం-గుర్తింపు పొందిన యూనివర్సిటీకి చెందిన ప్రాంతీయ కేంద్రా (రీజనల్ క్యాంపస్) ల్లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ చదివిన విద్యార్థులు.. మరో ఏడాది అదనంగా అక్కడ ఉండేందుకు అవకాశం కల్పిస్తోంది.
పోస్ట్ స్టడీ వర్క్ :
పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ పరంగా విద్యార్థులు కోర్సును చదివిన ప్రాంతాన్ని బట్టి ఈ పర్మిట్ కాల పరిమితిని నిర్ణయిస్తున్నారు. బ్రిస్బేన్, సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో చదవుతున్న విద్యార్థులకు రెండేళ్ల కాల పరిమితితో.. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు మూడు లేదా నాలుగేళ్ల కాల పరిమితిలో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్‌ను పొందేందుకు అనుమతి లభిస్తుంది.
ఎంఎస్.. ఇవి ఉత్తమం
ఆస్ట్రేలియాలో ఎంఎస్ ప్రోగ్రామ్‌ల పరంగా విస్తృత స్థాయిలో స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఉత్తమ స్పెషలైజేషన్స్‌గా గుర్తింపు పొందుతున్నాయి. అవి.. బ మాస్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ నెట్‌వర్క్ ఇంజనీరింగ్ బ మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బ మాస్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ బ మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ అండ్ సిస్టమ్స్ బ మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్.
ఆస్ట్రేలియాలో ఎంఎస్ .. గణాంకాలు
మన విద్యార్థులకు అనుకూలం..
ఆస్ట్రేలియాలో ఎంఎస్ ప్రోగ్రామ్‌లు మన విద్యార్థులకు అనుకూలమని చెప్పొచ్చు. ఇక్కడ తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఉత్తమ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆయా యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక అక్కడే ఉండేందుకు వీలుంది.
- రాఘవ ఉడుముల, సీఓఓ, Conduira WWEC (Conduira వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్స్)

- మొత్తం 6.3 లక్షలకు పైగానే అంతర్జాతీయ విద్యార్థులు.
- పదకొండు వందలకు పైగా ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంఎస్ ప్రోగ్రామ్
- బెస్ట్ స్టూడెంట్ సిటీస్‌లో ఏడు ఆస్ట్రేలియాలోనే
- అందుబాటులోని కోర్సుల సంఖ్య-23వేలు
- భద్రత పరంగా అంతర్జాతీయంగా 13వ స్థానం.
మన విద్యార్థులకు అనుకూలం..
ఆస్ట్రేలియాలో ఎంఎస్ ప్రోగ్రామ్‌లు మన విద్యార్థులకు అనుకూలమని చెప్పొచ్చు. ఇక్కడ తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఉత్తమ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆయా యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక అక్కడే ఉండేందుకు వీలుంది.
- రాఘవ ఉడుముల, సీఓఓ, Conduira WWEC (Conduira వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్స్)
Published date : 09 Jan 2020 04:43PM