Skip to main content

Telangana Government Jobs 2022 : 9,096 గురుకుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం.. నోటిఫికేషన్లు ఇలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. నాలుగు గురుకుల సొసైటీల్లో 9,096 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేస్తూ నియామక బాధ్యతను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐ–ఆర్‌బీ)కు బాధ్యతలు అప్పగించింది.
Telangana Government Jobs
Telangana Gurukula Jobs Recruitment 2022

ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్లు తదితర పూర్తి సమాచారంతో కూడిన ప్రతిపాదనల (ఇండెంట్లు)ను సంక్షేమ గురుకుల సొసైటీలు తాజాగా తయారు చేశాయి.

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

వెంటనే ఉద్యోగాల భర్తీని..
ప్రతిపాదనల తయారీలో ప్రధానంగా నూతన జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగ కేటాయింపుల అంశం కాస్త జాప్యం కావడంతో ప్రతిపాదనల రూపకల్పన సైతం కాస్త పెండింగ్‌లో పడిపోయింది. తాజాగా జీఓ 317 ప్రకారం అన్ని గురుకుల సొసైటీల్లో ఉద్యోగ కేటాయింపులు పూర్తికాగా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. ఉద్యోగ కేటాయింపుల ప్రతిపాద నలకు ఆమోదం లభించిన వెంటనే ఉద్యోగులకు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్న సొసైటీలు.. వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను బోర్డుకు సమర్పించే అవకాశం ఉంది.

TS Gurukulam Jobs 2022 : త్వ‌ర‌లో టీఎస్ గురుకులం.. ఈ టిప్స్ పాటిస్తే మీకు జాబ్ త‌థ్యం..||TGT Best Preparation Tips

అత్యధిక ఖాళీలను.
ప్రస్తుతం గురుకుల కొలువుల్లో అత్యధికంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 9,096 పోస్టులకు అనుమతులు ఇవ్వగా వాటిలో మూడో వంతుకు పైబడిన ఖాళీలు మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)లో ఉన్నాయి.

టెట్‌ మెరిట్‌తో..
ఆ తర్వాత స్థానంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో 2,267 ఉద్యోగాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 1,514 కొలువులు, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌) పరిధిలో 1,445 ఉద్యోగ ఖాళీలున్నాయి. గురుకుల టీజీటీ పోస్టులకు టెట్‌ మెరిట్‌తో ముడిపడి ఉంది. ఈ క్రమంలో ఇటీవల టెట్‌ ఫలితాలు సైతం వెలువడటంతో ఆయా పోస్టుల నియామకాలకు మార్గం సుగమమైంది.

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

కేటగిరీలవారీగా నోటిఫికేషన్లు..
ఇక పీజీటీ, జేఎల్, డీఎల్‌ పోస్టులకు సంబంధించిన నిబంధనలు సైతం ఖరారయ్యాయి. ఈ క్రమంలో గురుకుల సొసైటీలు నియామక బోర్డుకు ఇండెంట్లు సమర్పించిన వెంటనే వాటిని దాదాపు పక్షం రోజుల్లో పరిశీలించి కేటగిరీలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని గురుకుల సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు.

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

సొసైటీల వారీగా భర్తీ చేయనున్న ఉద్యోగాల సంఖ్య :
సొసైటీ                                         పోస్టులు 
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌               2,267 
టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌                 1,514 
టీఎంఆర్‌ఈఐఎస్‌                          1,445 
ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌   3,870 
మొత్తం                                          9,096

Published date : 13 Aug 2022 03:19PM

Photo Stories