Skip to main content

Gurukulam Contract Lecturer Removed : 2,267 మంది ఉద్యోగుల‌ను తొల‌గింపు.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు, పారితోషికం కింద పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది.
Telangana Government 2267 Gurukulam Contract Employees Removed

ఈ మేరకు ఎస్సీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నియామక ప్రక్రియ ద్వారా 2,267 మంది రెగ్యులర్ అధ్యాపకులు, ఇతర సిబ్బంది చేరినందున పార్ట్‌టైమ్‌ సిబ్బందిని తొలగిస్తున్నట్టు తెలిపారు. ప్రిన్సిపాళ్లు వారిని తొలగించాలని కోరారు.ఆ తర్వాత ఖాళీల వివరాలను పంపించాలని కోరారు.

 Common Test For All Government Jobs : ఇక‌పై అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష.. రానున్న నోటిఫికేష‌న్‌ల‌లో..!

కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ పద్ధతిలో..
అవసరాన్ని బట్టి కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలను చేపడతామని స్పష్టం చేశారు. తొలగింపును నిరసిస్తూ ఎస్సీ గురుకుల కార్యదర్శి కార్యాలయం వద్ద సిబ్బంది ధర్నా నిర్వహించారు. గెస్ట్, పార్ట్ టైమ్‌ టీచర్లు, కోచ్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 High court Order on TSPSC Group 4 Jobs : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 నియామకాలపై హైకోర్టు కీల‌క‌ ఆదేశం...

Published date : 05 Sep 2024 03:59PM

Photo Stories