KGBV Teacher Jobs: కేజీబీవీల్లో కాంట్రాక్ట్ అధ్యాపక పోస్టుల భర్తీ
ఈ సందర్భంగా అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమ, నిబంధనల మేరకు పూర్తి పారదర్శకతతో పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. అభ్యర్థుల దరఖాస్తు నుంచి నియామకపత్రాల జారీ వరకు ప్రతి దశలోనూ పూర్తి సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు అంకితభావంతో పనిచేయాలని, ఉపాధ్యాయ వృత్తి ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. నియామక పత్రాలు పొందిన వారంతా వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.
చదవండి: KGBV Jobs: పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
డీఈఓ సోమశేఖర శర్మ మాట్లాడుతూ జిల్లాలోని 14 కేజీబీవీలకు గాను 12 విద్యాలయాల్లో సీఆర్టీ, పీజీ సీఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించామని, 5 సీఆర్టీ, 42 పీజీ సీఆర్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించిందని చెప్పారు. కార్యక్రమంలో జీసీడీఓ కె.భూలక్ష్మి, సీఎంఓ వై.రాజశేఖర్, ఏపీఓ ఎన్.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్‌లు చావా శ్రీనివాసరావు, ఎస్.శ్రీధర్ బాబు, జి.ఎస్.ప్రసాద్ పాల్గొన్నారు.