Jobs: సమగ్ర శిక్ష ఐఈఆర్టీ పోస్టుల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
ఆ రోజు ఉదయం 9 గంటలకు మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్లో కృష్ణా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అమరావతిలోని సమగ్ర శిక్ష రాష్ట్ర పఽథక సంచాలకులు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను తయారు చేశామని, వారికి స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలను జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో 30వ తేదీన ఎంఆర్ కేటగిరి, హెచ్‌ఐ/వీఐ కేటగిరి అభ్యర్థులకు నిర్వహిస్తామని తెలిపారు.
చదవండి: SSC Constable Posts in Delhi: 7547 కానిస్టేబుల్ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
ఇంటర్వ్యూలకు ఎంపికై న అభ్యర్థుల వివరాలు డీఈవోకేఎస్‌ఎన్.వీక్లీ.కామ్ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు. ఎంపికై న వారికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేస్తామని పేర్కొన్నారు. ఎంఆర్ కేటగిరి వారు ఉదయం 9 గంటలకు, హెచ్‌ఐ/వీఐ కేటగిరి వారు మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరుకావాల్సిందిగా కోరారు.