Skip to main content

Groups Preparation Tips: సివిల్స్, గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ఒకే సమ‌యంలో ప్రిప‌రేష‌న్‌కు వ్యూహాలు..

జాతీయ స్థాయిలో లక్షల మంది లక్ష్యం.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్! రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగార్థుల టార్గెట్.. గ్రూప్స్ ఎగ్జామ్స్! ఈ పరీక్షల్లో విజయానికి కొందరు ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటే.. మరికొందరు బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ప్రణాళికలు అమలు చేస్తూ పోటీ పరీక్షల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
group exam preparation tips
Civils & Groups Preparation Tips

ఈ నేపథ్యంలో సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధమయ్యే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ..

ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ నుంచి త్వరలోనే గ్రూప్స్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయనే వార్తలు అభ్యర్థులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థులు ఇక ఆల‌స్యం చేయకుండా.. ఇప్ప‌టి నుంచే స‌రైన మార్గంలో ప్రిప‌రేష‌న్ కొన‌సాగిస్తే... మీ ఉద్యోగ ల‌క్ష్య సాధ‌న ఈజీ అయ్యే అవ‌కాశం ఉంది.

ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌ల ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఒక్కసారి నోటిఫికేషన్ వెలువడ్డాక..
సబ్జెక్టులను ఎంచుకున్నాక అప్లికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ని తెలుసుకోండి. ఏ విభాగానికి ఎన్ని మార్కులు కేటాయించారనే దాని ఆధారంగా సిలబస్‌ను విభజించుకోండి. ఈ కంటెంట్‌ని అధ్యాయాలు, యూనిట్లుగా విభజించి టైంటేబుల్ వేసుకోండి. వెయిటేజీ ఆధారంగా ప్రాధాన్యత ఇచ్చి.. పక్కా ప్రణాళికతో చదవడం ప్రారంభించండి. ఒక్కసారి నోటిఫికేషన్ వెలువడ్డాక ప్రతి క్షణం విలువైనదే. కాబట్టి సమయం వృధా చేయకుండా పరీక్షలకు సిద్దమవ్వాలి.

ఈ స్థాయిలో ప్రిపరేషన్ అయితే ..
సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ఉమ్మడిగా సన్నద్ధమయ్యే అభ్యర్థులు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. గ్రూప్స్‌తో పోల్చితే సివిల్స్ సిలబస్ కాస్త కఠినంగా ఉంటుంది. కాబట్టి సివిల్స్ సిలబస్‌ను లోతుగా చదవాలి. ఇది గ్రూప్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. సివిల్స్, గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ల్లోని సారూప్యతే దీనికి కారణం. సివిల్స్ మెయిన్స్‌లో ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్‌ను మినహాయిస్తే మిగిలిన అన్ని సబ్జెక్టులు గ్రూప్స్ సిలబస్‌లోనూ కనిపిస్తాయి.

Good News: త్వ‌ర‌లోనే ఏపీపీఎస్సీ ద్వారా 3,946 పోస్టుల భర్తీకి రెడీ.. ఇంకా

రెండు సిలబస్‌లను బేరీజు వేసుకుంటూ..
అభ్యర్థులు ఒక సబ్జెక్టులోని అంశాలపై అవగాహన పొందే విషయంలో రెండు పరీక్షలకు ఉపయోగపడేలా వ్యవహరించాలి. ప్రధానంగా జనరల్ స్టడీస్, జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ వంటి సబ్జెక్టులకు సంబంధించి రెండు సిలబస్‌లను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఈ క్రమంలో ముందు ఉమ్మడి అంశాల ప్రిపరేషన్‌ను పూర్తిచేసి.. తర్వాత వేర్వేరుగా ఉన్న అంశాలపై దృష్టిసారించాలి. అభ్యర్థులు ఈ విషయంలో ఆయా పరీక్షల తేదీలకు అనుగుణంగా వ్యవహరించాలి.

APPSC 730 Posts Notification : ఏం చదవాలి.. ఎలా చదవాలి..?

ప్రశ్నల శైలికి అనుగుణంగా..
యూపీఎస్సీ సివిల్స్ ప్రశ్నల శైలి.. గ్రూప్స్ ప్రశ్నల శైలికి కొంత భిన్నంగా ఉంటుంది. సివిల్స్‌లో ఎక్కువగా స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు కనిపిస్తాయి. గ్రూప్స్ పరీక్షల్లో ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలకు ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఇటీవల గ్రూప్స్ పరీక్షల్లోనూ మ్యాచింగ్స్, కొద్ది స్థాయిలో స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఒక అంశాన్ని చదువుతున్నప్పుడే కాన్సెప్ట్ ఓరియెంటేషన్‌తో ముందుకు సాగితే రెండు పరీక్షలకు ఉపయోగపడుతుంది.

560 Posts : గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం.. వచ్చే నెలలో నోటిఫికేషన్‌

సమన్వయం ఇలా..
ఇటీవల కాలంలో సివిల్స్, గ్రూప్స్ ఫలితాలను విశ్లేషిస్తే విజేతల్లో 30 నుంచి 40 శాతం వరకు అప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారే ఉంటున్నారు. వీరంతా ఉద్యోగాన్ని, ప్రిపరేషన్‌ను సమన్వయం చేసుకుంటూ నిర్దిష్ట ప్రణాళిక, టైం మేనేజ్‌మెంట్‌తో పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు. సాధారణంగా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు రోజుకు 12 నుంచి 14 గంటలు చదువుతామని చెబుతుంటారు. ఇది ఫ్రెషర్స్ లేదా పూర్తి సమయం పోటీ పరీక్షలకు కేటాయించే అభ్యర్థులకు వీలైనా.. ఉద్యోగం చేస్తున్నవారికి కుదరదు. ఇలాంటి వారు ఏడాది పాటు రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రిపరేషన్ కొసాగిస్తే రెండు పరీక్షల సిలబస్‌ను పూర్తి చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో.. :
శిక్షణ సంస్థలు, నిపుణుల వద్ద ప్రత్యక్షంగా శిక్షణ తీసుకునే అవకాశం లేనివారికి ఆన్‌లైన్‌లో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. పలు ప్రముఖ వెబ్‌సైట్లు ఆన్‌లైన్ లెక్చర్స్, ఆన్‌లైన్ ట్యుటోరియల్స్‌ను అందిస్తున్నాయి. దీంతోపాటు మొబైల్ యాప్‌ల ద్వారా సివిల్స్ మెటీరియల్ అందుబాటులో ఉంది. వీటిని సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగార్థులతో పాటు జాబ్ హోల్డర్స్ కూడా సబ్జెక్టులపై పట్టు సాధించొచ్చు. ప్ర‌ముఖ ఎడ్యుకేష‌న్ పోర్ట‌ల్‌.. ఎడ్యుకేష‌న్‌.సాక్షి.కామ్(education.sakshi.com/) లో సివిల్స్‌, గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి తాజా స‌మాచారం అందుబాటులో ఉంది.

మెటీరియల్ సేకరణలో..
సాధారణంగా అభ్యర్థులు ఒక సబ్జెక్టు ప్రిపరేషన్ కోసం మూడు, నాలుగు పుస్తకాలను చదువుతుంటారు. కానీ, ఉద్యోగస్థుల విషయంలో ఇది సాధ్యం కాదు. వీరు మిగిలిన వారితో పోల్చుకోకుండా ఒక సబ్జెక్టు పరంగా సమగ్ర సమాచారం ఉన్న ఒక పుస్తకానికి పరిమితం కావడం మేలు. అయితే ఇలా ఒక పుస్తకాన్నే ఎంపిక చేసుకునే క్రమంలో నిపుణుల సలహాలు తప్పక తీసుకోవాలి.

ఏపీపీఎస్సీ ప‌రీక్షల‌ స్ట‌డీమెటీరియ‌ల్ కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ ప‌రీక్షల‌ స్ట‌డీమెటీరియ‌ల్ కోసం క్లిక్ చేయండి

ఆన్‌లైన్ టెస్ట్‌లతో..
ఇటీవల కాలంలో వెబ్ పోర్టల్స్, పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఆన్‌లైన్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. వాటికి హాజరైతే సదరు పరీక్ష శైలితోపాటు స్వీయ ప్రతిభపై అవగాహన ఏర్పడుతుంది. అదే విధంగా పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.

ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్టుల కోసం క్లిక్ చేయండి

APPSC Groups Practice Tests

ఒక మెంటార్‌ను..
ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ప్రిపరేషన్‌కు ఉపక్రమించినప్పటికీ.. సరైన మార్గంలో పయనించేందుకు ప్రతి సబ్జెక్టుకు ఒక మెంటార్‌ను ఎంపిక చేసుకోవాలి. సబ్జెక్టులో నిపుణులైన మెంటార్స్ ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ప్రిపరేషన్ పరంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు పరీక్ష తేదీకి కనీసం నెల రోజుల ముందు సెలవు పెట్టి.. పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించాలి. అలాచేస్తే సబ్జెక్టు పరంగా, మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష గదిలోకి అడుగుపెట్టొచ్చు.

రెగ్యులర్ స్టూడెంట్స్‌తో... 
ఉద్యోగం చేస్తూ సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు.. తరచు పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులతో కమ్యూనికేట్ అవ్వాలి. ఫలితంగా తమకు తెలియని అంశాల గురించి తెలుసుకునే అవకాశంతోపాటు తాజా పరిణామాలపై అవగాహన పొందొచ్చు.

Government Jobs: ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం కీలక సంస్కరణలు ఇవే.. ఈ నిబంధనలు తొలగింపు

కరెంట్ అఫైర్స్ కోసం..
జాబ్ హోల్డర్స్ ప్రిపరేషన్ పరంగా రోజూ న్యూస్ పేపర్ చదవాలి. ఇటీవల కాలంలో సివిల్స్, గ్రూప్స్ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. దాదాపు 30 నుంచి 40 శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ఆధారితంగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజూ న్యూస్ పేపర్ చదవడం, అందులోని ముఖ్య పరిణామాలను గుర్తించడం, వాటి నేపథ్యం గురించి తెలుసుకోవడం వంటివి చేయాలి.

డైలీ, వీక్లీ, మంత్లీ క‌రెంట్అఫైర్స్ కోసం క్లిక్ చేయండి

పరీక్ష రాసే స‌మ‌యంలో..
పరీక్ష రాసేటప్పుడు సమయ పాలన చాలా ముఖ్యం. మీకు బాగా వచ్చిన అంశాలను త్వరగా పూర్తి చేసి.. కష్టమైన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా ఫలితం ఉంటుంది. మనం ఎంత బాగా పరీక్షలకు ప్రిపేర్ అయినా సమయం చాలకపోవడంతో ఫెయిలైన సందర్భాలు ఉంటాయి. కాబట్టి సరైన ప్రణాళికతో పరీక్షలకు హాజరవ్వండి.

మీ మైండ్‌ను..
పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో కొన్ని ఆటంకాలు రావడం సహజం. టీవీ, సినిమాలు, క్రికెట్, సెల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి వాటి వల్ల మైండ్ డిస్టర్బ్అవుతుంటుంది. మన మెదడును డిస్ట్రాక్ చేసే విషయాల జోలికి వెళ్లకండి. సాధ్యమైనంత వరకు ప్రిపరేషన్ పై దృష్టి సారించాలి.

నెగిటివ్ విషయాలకు దూరంగా.. ఆత్యస్థైర్యంతో ముందుకు..
ఏ ఉద్యోగానికైనా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మీరు సాధించగలరనే నమ్మకంతో పరీక్షలకు సన్నద్ధం అవ్వండి. కొందరికి ఒకే ప్రయత్నంలో ఉద్యోగం రావచ్చు.. మరికొందరికి ఇంకాస్త సమయం పట్టవచ్చు. దేనినైనా సింపుల్‌గా తీసుకోండి. ప్రిపరేషన్‌పై మాత్రమే దృష్టి సారించండి. సాధ్యమైనంత వరకు నెగిటివ్ విషయాలకు దూరంగా ఉండండి. ఆత్యస్థైర్యంతో ముందుకు సాగండి.

ప్రిపరేషన్ స‌మ‌యంలో చేయాల్సినవి..
✔ రోజూ క్రమం తప్పకుండా చదివేలా సమయ ప్రణాళిక.
✔ ఆన్‌లైన్ లెక్చర్స్, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం.
✔ మెంటార్స్ గెడైన్స్ తీసుకోవడం.
✔ ఫుల్‌టైమ్ ప్రిపరేషన్ సాగిస్తున్న వారితో సంప్రదింపులు.
✔ కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యమిస్తూ న్యూస్ పేపర్ రీడింగ్.

ప్రిపరేషన్ స‌మ‌యంలో చేయకూడనివి..
✘ ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి నాలుగైదు పుస్తకాలు చదివే ధోరణి.
✘ ప్రామాణిక మెటీరియల్ లేకుండా ప్రిపరేషన్‌కు ఉపక్రమించడం.
✘ ఒక సబ్జెక్ట్/పేపర్ పూర్తయ్యాక మరో దానిపై దృష్టి పెట్టొచ్చనే ధోరణి.
✘ ఇన్‌స్టంట్ గైడ్స్, కొశ్చన్ బ్యాంక్స్‌కు పరిమితం కావడం.

ఇది చాలా కీలకం..
సివిల్స్, గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ విషయంలో ప్రధాన పాత్ర పోషించేది సమయపాలనే. అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని రోజూ కచ్చితంగా కొన్ని గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. అంతేకాకుండా ఆ సమయంలోనే సివిల్స్, గ్రూప్స్ సిలబస్‌ను బేరీజు వేసుకొని, రెండింటికీ ఉపయోగపడేలా ముందుకు సాగాలి.

ఎండోమెంట్‌ గ్రేడ్‌–3 ఆఫీసర్ ఉద్యోగం సాధించ‌డం ఎలా..?

ఏపీపీఎస్సీ పోస్టుల మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, బిట్‌బ్యాంక్‌, జీకే, క‌రెంట్ అఫైర్స్‌, సిల‌బ‌స్‌, స్ట‌డీమెటీరియ‌ల్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

వీటిపై ప‌ట్టు... ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్ కొట్టు

Published date : 23 Feb 2022 01:51PM

Photo Stories