34 Jobs: పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. పోస్టుల వివరాలు ఇలా..
నూతనంగా 34 మంది ఫైర్ సిబ్బంది పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటూరునాగారాన్ని అక్టోబర్ 7న రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి 24 గంటలు గడవక ముందే ఫైర్ స్టేషన్ సై తం మంజూరు చేయడంతో ఏజెన్సీ వాసుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
చదవండి: Fire Dept: విద్యాశాఖకు శాఖకు ఫైర్ సర్వీస్ లింక్
ఫైర్ స్టేష న్‌లో సిబ్బంది నియామకానికి సైతం ఆర్థిక శాఖ రూ. 231కోట్లను మంజూరు చేసింది. ఈ ఫైర్ స్టేష న్ పరిధిలో ఏటూరునాగారం, మంగపేట, తాడ్వా యి, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల పరిధిలో అగ్రి ప్రమాదాలు సంభవిస్తే ములుగు నుంచి ఫైర్ ఇంజన్ వచ్చే వరకు జరగాల్సిన నష్టం జరిగిపోయేది. ఇప్పుడు అలాంటి నష్టం లేకుండా నివారణ చర్యలు తీసుకునేందుకు నూతనంగా ఫైర్ స్టేషన్ మంజూరు కావడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్: 1
స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 2
లీడింగ్ ఫైర్‌మెన్: 4
డ్రైవర్, ఆపరేటర్: 5
ఫైర్‌మెన్: 20
జూనియర్ అసిస్టెంట్లు: 1
స్వీపర్: 1