3000 RTC Jobs Notification 2024 : ఆర్టీసీలో 3,000 డ్రైవర్, కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..!
దీని మీద ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన పిమ్మట నోటిఫికేషన్ విడుదల జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే 3 వేల నూతన బస్సుల కొనుగోలుకు సంబంధించిన కార్యచరణ ప్రారంభమైందని తెలిపారు.
మహలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించిన నేపథ్యంలో రద్దీ భారీగా పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నూతన బస్సుల కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని టీఎస్‌ఆర్టీసీ (TSRTC) కేంద్ర కార్యాలయం బస్ భవన్‌లో జనవరి 26వ తేదీన (శుక్రవారం) గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది.సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా త్వరలోనే సంస్థ కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని తెలిపారు.
☛ Anganwadi Worker Salary Hike Update 2024 : అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవాల్సిందే.. ఇంకా..
పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే 1,325 డీజిల్, మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెస్తోంది. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోంది. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్ మెంట్‌ను చేపడుతామని తెలిపారు.
813 మందికి..
కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం వీరికి అపాయిట్మెంట్ లెటర్లను అందజేయనున్నారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారని సజ్జనర్ తెలిపారు. అలాగే టీఎస్ఆర్టీసీ సిబ్బంది పెండింగ్ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.
రోజుకు 27 లక్షల మంది మహిళలకు..
మహాలక్ష్మి స్కీం కింది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంను.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే సమర్థవంతంగా సంస్థ అమలు చేసిందని గుర్తు చేశారు. సంస్థకు చెందిన 7,200 పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహాలక్ష్మి స్కీం విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పడానికి తనకెంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఈ స్కీమ్ ను ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు.
టీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధి, నిబద్దతతో పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమైతుందన్నారు.మహాలక్ష్మి స్కీమును ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా అమలు చేస్తున్నారని సంస్థ అధికారులను, సిబ్బందిని ప్రభుత్వం మెచ్చుకుందని పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏ ఛాలెంజ్ ను తీసుకువచ్చిన అధికారులు, సిబ్బంది విజయవంతం చేస్తున్నారని, ఛాలెంజ్ కు తగ్గట్టుగా పనిచేస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా సంక్రాంతికి సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేశారని, ఇన్సిడెంట్ ఫ్రీగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని, అదే స్పూర్తితో.. ఉత్సాహంతో రాబోయే మేడారం జాతరకు పనిచేయాలన్నారు.
Tags
- TSRTC jobs
- TS RTC Driver and Conductor Jobs Notification 2024
- TS RTC 3000 Driver and Conductor Jobs Notification 2024
- minister ponnam prabhakar announcement rtc jobs
- minister ponnam prabhakar announcement rtc driver jobs
- minister ponnam prabhakar announcement rtc conductor jobs
- 3000 RTC Driver and Conductor Jobs Notification 2024 News in Telugu
- tsrtc md sajjanar
- tsrtc md sajjanar jobs news
- tsrtc md sajjanar latest news
- tsrtc md sajjanar teugu news
- tsrtc md sajjanar driver and etc jobs
- minister ponnam prabhakar announcement 3000 rtc conducter and driver jobs
- Telangana RTC Jobs
- TSRTC Recruitment
- 3
- 000 Job Openings
- Employment News
- Driver and Conductor Vacancies
- sakshi education job notifications
- latest jobs in 2024