Skip to main content

Family Success Story : ఒకే నెల‌లో.. ఒకే సారి ఇద్దరు అన్నాతమ్ముళ్లు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టారిలా..

ఈ ఇద్ద‌రు కొడుకులు తండ్రి ప‌డే క‌ష్టాన్ని చాలా ద‌గ్గ‌రి నుంచి చూశారు. ఎలాగైన తండ్రికి తోడుగా ఉండాల‌ని.. ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి ఉన్న‌త ఉద్యోగాలు సాధించారు.
two brothers success stories in telugu
two brothers success stories

అలాగే అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకున్నారు. వీరే లక్ష్మిరాజు, వినేష్‌. తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సారంగపూర్ మండ‌లం ఆలూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ఇద్దరు అన్నాతమ్ముళ్లు.

☛ APPSC Group 1 Ranker : గ్రూప్‌-1, 2 రెండు ఉద్యోగాలు కొట్టానిలా..

నెలరోజుల వ్యవధిలోనే..
ఈ ఇద్దరు అన్నాతమ్ముళ్లు నెలరోజుల వ్యవధిలోనే రెండు ఉద్యోగాలు సాధించి శభాష్‌ అనిపించుకున్నారు. సారంగపూర్ మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన మాన్పూరి లక్ష్మణ్‌–లక్ష్మీలకు ముగ్గురు సంతానం. ఇందులో పెద్ద కుమార్తెకు వివాహం కాగా ఇద్దరు కుమారులు లక్ష్మిరాజు, వినేష్‌ ఉన్నారు. అయితే బీడీ కంపెనీ నిర్వహిస్తూ ఇద్దరు కుమారులను తల్లిదండ్రులూ కష్టపడి చదివించారు. వారి కోరుకున్నట్లే పెద్దవాడైన లక్ష్మిరాజు ఇటీవల కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.

☛ APPSC Group 1 Ranker Gnanananda Reddy Success : గ్రూప్‌-1లో విజ‌యం సాధించానిలా.. మా నాన్న కోసం ఎలాగైన‌ ఈ లోటును భ‌ర్తీ చేస్తా..

తమ్ముడు దేశ రక్షణలో, అన్న రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే ఉద్యోగం..
నెలరోజుల వ్యవధిలోనే రెండురోజుల క్రితం విడుదలైన నావికాదళం(నేవి) ఉద్యోగానికి అతడి తమ్ముడు వినేష్‌ ఎంపికయ్యాడు. ఇటీవ‌లే ఆయన నియామక పత్రాన్ని అందుకున్నాడు. తమ్ముడు దేశ రక్షణ దళంలో, అన్న రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే ఉద్యోగం సాధించడంపై మండల ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తూ శభాష్‌ సోదరులారా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అలాగే ఒకే సారి త‌మ కొడుకులు ఉద్యోగాలు సాధించ‌డంతో త‌ల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేశారు. మా క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్కింద‌న్నారు.

 APPSC Group 1 Ranker Inspirational Story : ప్రాణాపాయం నుంచి భ‌య‌టప‌డ్డానిలా.. ఎన్నో వివ‌క్ష‌త‌లు ఎదుర్కొంటూనే గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

Published date : 30 Oct 2023 06:35PM

Photo Stories