Teacher Jobs: టీచర్ పోస్టులు గల్లంతు..!
ఏళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను ఖాళీపోస్టులు వెక్కిరిస్తున్నాయి. ఏళ్లుగా ఎదురుచూసినా ఫలితం లేకుండాపోయిందని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
317 జీవో ద్వారా సొంత జిల్లావాసులతో పా టు నిజామాబాద్ నుంచి అదనంగా దాదాపు 500 మంది రావడంతో ఖాళీ పోస్టుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. ఇదే సమయంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా క్రమబద్ధీకరించడం, అలా గే పలు స్కూళ్లు మూతబడడంతో ఉన్న టీచర్లను సర్దుబాటు చేయడం మూలంగా పోస్టుల్లో మరింత కోత పడింది. అన్ని ఖాళీలు కలిపి దాదాపు 135 వ రకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: DSC Notification 2023: 6,612 పోస్టుల భర్తీ.. భర్తీ చేసే పోస్టులు ఇవీ..
జిల్లాలో బీఎడ్, డీఎడ్ చదివి టెట్ ఉత్తీర్ణులైన వేలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నా రు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా డీఎస్సీ వేయలేదు. ఇప్పుడు డీఎస్సీ వస్తుందని తెలిసినా, నిరుద్యోగుల్లో నిరాశే కనిపిస్తోంది. ఏళ్లుగా వేలల్లో ఖర్చు చేస్తూ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఉన్న కొద్దిపాటి పోస్టులకు ప్రిపేరై ఒక్కో పోస్ట్‌కు వందల్లో పోటీ పడే అవకాశాలున్నాయని అంటున్నారు.
చదవండి: AP DSC 2023 : DSC సిలబస్, బెస్ట్ బుక్స్ ఇవే..| ముందుగానే..ఇలా చదివితే 'టీచర్' ఉద్యోగం మీదే..