Teachers Seniority List: ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా
Sakshi Education
ఆదిలాబాద్ టౌన్: ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబి తాను విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపర్చారు.
ఇందులో పొరపాట్లు ఉన్న వాటికి సంబంధించి జూన్ 11న ఫిర్యాదులు స్వీకరించారు. జూన్ 12న కూడా ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని డీఈవో ప్రణీత తెలిపారు.
చదవండి: బ్రేకింగ్ న్యూస్ (TS TET Results 2024): టీఎస్ టెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి
13, 14 తేదీల్లో ఎస్జీటీ కేటగిరి నుంచి స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల కోసం వెబ్‌ఆప్షన్లు, 16న పదోన్నతుల ప్రక్రియ, ప్రమోషన్ లభించిన ఉపాధ్యాయులు పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంది. అలాగే 17న ఎస్జీటీల ఖాళీ ల వివరాలు, 18న సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నారు.
19న అభ్యంతరాల స్వీకరణ, 20న బదిలీలు, 21న బదిలీ అయిన పాఠశాల నుంచి కొత్త పాఠశాలలో చేరనున్నారు.
Published date : 12 Jun 2024 03:58PM