స్టాఫ్ నర్సు పోస్టుల ఫైనల్ మెరిట్ జాబితా విడుదల.. జోన్‌ల వారీగా పోస్టుల భర్తీ ఇలా..
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీలో భాగంగా ఫైనల్ మెరిట్ జాబితాను జోన్– 2, 3, 4లలో విడుదల చేశారు.
జోన్–1లో ఫైనల్ మెరిట్ జాబితా విడుదల కావాల్సి ఉంది. 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి డిసెంబర్ మొదటి వారంలో వైద్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు జోన్‌లలో 40 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా జోన్–2లో 12,295 మంది ఉన్నారు. ఫైనల్ మెరిట్ జాబితా వెలువడిన నేపథ్యంలో ఈ వారంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.
చదవండి: Telangana Job notification: 5204 స్టాఫ్ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
జోన్‌ల వారీగా పోస్టుల భర్తీ ఇలా
జోన్ |
పోస్టులు |
1 |
163 |
2 |
264 |
3 |
239 |
4 |
291 |
మొత్తం |
957 |
Published date : 09 Jan 2023 03:14PM