1,569 Jobs: మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీ
ఇందులో పట్టణ వైద్యంలో 349, పల్లె వైద్యంలో 1,220 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ సెప్టెంబర్ 7న ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన జిల్లాల్లో స్థానిక సెలెక్షన్ కమిటీల ద్వారా భర్తీ చేస్తారు. మున్సిపాలిటీల పరిధిలో ఈ పోస్టుల్లో పనిచేయడానికి MBBS/BAMS అర్హత కలిగిన వైద్యులను తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టులకూ పై అర్హతలు, నిబంధనలే వర్తిస్తాయి. అయితే గ్రామీణ ప్రాంతంలో పనిచేసేందుకు MBBS/BAMS వైద్యులు ముందుకు రాకపోతే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులను లేదా 2020కి ముందు BSc Nursing/GNMలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో బ్రిడ్జి ప్రోగ్రామ్ పూర్తిచేసిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకు ఎంపికైనవారి తుది జాబితాను అక్టోబరు 3న ప్రదర్శిస్తారు.
చదవండి:
Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్ ఖాయం... నెలకు రూ.44 వేల వరకు జీతం
ఆన్‌లైన్ బోధనా సౌకర్యంలేని ఏజెన్సీ విద్యార్థులకు ‘గిరిదర్శిని స్టడీ మెటీరియల్’..!