Medical and Health Department: అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు పోస్టింగ్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు పోస్టింగ్
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 12న ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. ఇటీవల 375 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు.
375 పోస్టులకు గాను 191 మంది ఎంపికయ్యారు. వీరందరికీ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన పోస్టులు వాక్ ఇన్ ఇంటర్వూ్యల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు.