డీఎస్సీ అభ్యర్థుల నియామకానికి ఉత్తర్వులు
మొత్తం 4,534 మందికి సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు లభించనున్నాయి. వీరిని మినిమమ్ టైమ్ స్కేలుపై నియమించేందుకు వీలుగా విధివిధానాలను విద్యాశాఖ ఈ జీవోలో పొందుపరిచింది. అప్పట్లో ఇంటర్వ్యూల్లో అర్హత సాధించినా.. ఎస్జీటీ పోస్టులు పొందలేకపోయిన వారు గతంలో ప్రభుత్వాల చుట్టూ తిరిగారు. న్యాయపోరాటమూ చేశారు. ఎట్టకేలకు సీఎం వైఎస్ జగన్ వారికి మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల నుంచి పాఠశాల విద్యాశాఖ ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించింది.
చదవండి: 11,687 గురుకుల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఏ నిబంధనలు వర్తిస్తాయో వీరిని కూడా అవే నిబంధనలతో నియమించాలని నిర్దేశించారు. 4,534 మందికి ఉద్యోగాలు కలి్పంచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత పేర్కొన్నారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఈ నెలాఖరులోపు నియామక పత్రాలు వస్తాయని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి అన్నారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.
చదవండి: Competitive Exams: పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్నారా... అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి