Department of Education: మల్టీజోన్–1 హెచ్‌ఎం పదోన్నతికి ఆప్షన్లు
సెప్టెంబర్ 22 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని విద్యాశాఖ పేర్కొంది. ఇటీవల హెచ్‌ఎంలను బదిలీ చేయడంతో మల్టీజోన్–1 పరిధిలో 1,093 హెచ్‌ఎం ఖాళీలు ఏర్పడ్డాయి. మల్టీజోన్–2 పరిధిలో 821 ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది ఉపాధ్యాయులు సీనియారిటీ సరిగా లేదంటూ కోర్టును ఆశ్రయించారు.
చదవండి: Teacher Recruitment Test: రోజుకు రెండు విడతలుగా TRT.. పరీక్ష విదానం ఇలా..
ఈ నేపథ్యంలో మల్టీజోన్–2 పరిధిలో పదోన్నతులు చేపట్టడం లేదు. మల్టీజోన్–1 పరిధిలో పదోన్నతికి అర్హులైన వారి జాబితాలను ఇప్పటికే వెల్లడించారు. ఎవరు ఏ ప్రాంతానికి వెళ్లాలనేది, లేదా పదోన్నతికి ఇష్టపడని వారు (నాట్ విల్లింగ్) ఆప్షన్స్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రమోషన్ల జాబితాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.