DSC Notification: నేటి నుంచి DSC దరఖాస్తులు
భువనగిరి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం బుధవారం నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ గడువు వచ్చే నెల 21వ తేదీ వరకు ఉంది. కాగా.. జిల్లాలో బీఈడీ చేసిన వారు 4,251 మంది, డీఈడీ చేసిన అభ్యర్థులు 3,548 మంది ఉన్నారు. వీరితో పాటు లాంగ్వేజ్ పండిట్ చేసిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన 99 పోస్టులను విద్యాశాఖ అధికారులు రోస్టర్ ప్రకారం రూపొందించారు. దీని ప్రకారం కేటగిరీల్లో ఒకటి, రెండు, లేదా ఒక్క కూడా పోస్టు లేని పరిస్థితి నెలకొంటుండడంతో అభ్యర్థులకు నిరాశ తప్పడం లేదు.
కేటాయించిన పోస్టుల వివరాలు
● ఎస్‌ఏ (బయోసైన్స్) తెలుగు: ఓసీ కేటగిరి జనరల్‌లో 1, మహిళా కేటగిరిలో 1, ఎస్సీ మహిళా కేటగిరిలో 1,
● ఎస్‌ఏ(హిందీ): జనరల్ కేటగిరిలో 2, మహిళా కేటగిరిలో 1, ఎస్సీ మహిళా కేటగిరిలో 1, బీసీ ఏ మహిళా కేటగిరిలో 1, బీసీ సీ జనరల్ కేటగిరిలో 1, వీహెచ్ మహిళా కేటగిరిలో 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
● ఎస్‌ఏ(ఉర్దూ): జనరల్ మహిళా కేటగిరిలో 1,
● ఎస్‌ఏ (ఫిజికల్ ఎడ్యుకేషన్)తెలుగు: ఓసీ జనరల్ మహిళా కేటగిరిలో 1,
● ఎస్‌ఏ(సోషల్ స్టడీస్) తెలుగు: ఓసీ జనరల్ కేటగిరిలో 3, మహిళా కేటగిరిలో 2, ఎస్సీ జనరల్ కేటగిరిలో 2, మహిళా కేటగిరిలో 1, ఎస్టీలో జనరల్ కేటగిరిలో 1, మహిళా కేటగిరిలో 1, బీసీ ఏ మహిళా కేటగిరిలో 1, బీసీ (బీ) మహిళా కేటగిరిలో 1, బీసీ (సీ) జనరల్ కేటగిరిలో 1, వీహెచ్ మహిళా కేటగిరిలో 1, ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరిలో 1, ఎక్స్‌సర్వీస్ కేటగిరిలో 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
● ఎస్‌ఏ( తెలుగు): ఓసీ జనరల్ కేటగిరిలో 3, మహిళా కేటగిరిలో 1, ఎస్సీ జనరల్ కేటగిరిలో 1, మహిళా కేటగిరిలో 1, ఎస్టీ మహిళా కేటగిరిలో 1, బీసీ ఏ మహిళా కేటగిరిలో 1, బీసీ బీ మహిళా కేటగిరిలో 1, వీహెచ్ మహిళా కేటగిరిలో 1, ఈడబ్ల్యూఎస్ జనలర్ కేటగిరిలో 1,
● ఎల్‌పీ(హిందీ): ఓసీ జనరల్ కేటగిరిలో 2, మహిళా కేటగిరిలో 1, ఎస్సీ మహిళా కేటగిరిలో 1, బీసీ ఏ మహిళా కేటగిరిలో 1,
● ఎల్‌పీ(తెలుగు) ఓసీ జనరల్ కేటగిరిలో 3, మహిళా కేటగిరిలో 2, ఎస్సీ జనరల్ 1, మహిళా కేటగిరిలో 1, ఎస్టీ మహిళ 1, బీసీ ఏ మహిళ 1, బీసీ బీ మహిళ 1, వీహెచ్ మహిళా కేటగిరిలో 1, హెచ్‌హెచ్ జనరల్ కేటగిరిలో 1, ఈడబ్ల్యూఎస్ జనలర్ 1, ఎక్స్ సర్వీస్ కేటగిరిలో 1,
● ఎల్‌పీ(ఉర్దూ) ప్రభుత్వ: ఓసీ మహిళా కేటగిరిలో 1,
● పీఈటీ(తెలుగు): ఓసీ మహిళా కేటగిరిలో 1, ఎస్సీ మహిళా కేటగిరిలో1,
● ఎస్జీటీ(తెలుగు)ప్రభుత్వ: ఓసీ జనరల్‌లో 2, మహిళా కేటగిరిలో 1, ఎస్సీ జనరల్‌లో 1, మహిళా కేటగిరిలో 1, బీసీఏ మహిళా కేటగిరిలో 1, వీహెచ్ మహిళా కేటగిరిలో 1,
● ఎస్జీటీ(తెలుగు): ఓసీ జనరల్‌లో 5, మహిళా కేటగిరిలో 4, ఎస్సీ జనరల్‌లో 3, మహిళా కేటగిరిలో 2, ఎస్టీ జనరల్ కేటగిరిలో 1, మహిళా కేటగిరిలో 1, బీసీ ఏ జనరల్‌లో 2, మహిళా కేటగిరిలో 1, బీసీ బీ జనరల్‌లో 1, మహిళా కేటగిరిలో 1, బీసీ సీ జనరల్‌లో 1, బీసీ డీ మహిళ కేటగిరిలో 1, బీసీ ఈ మహిళా కేటగిరిలో 1, వీహెచ్ మహిళా కేటగిరిలో 1, హెచ్‌హెచ్ జనరల్‌లో 1, ఈడబ్ల్యూఎస్ జనరల్‌లో 2, మహిళా కేటగిరిలో 1, ఎక్స్‌సర్వీస్ కేటగిరిలో 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.