Skip to main content

MLHP: నియామక పరీక్ష తేదీ ఇదే.. జోన్‌ల వారీగా ఖాళీలు ఇలా..

న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోవడంతో అక్టోబర్‌ 26న Mid Level Health Provider (MLHP) నియామక పరీక్షను నిర్వహించనున్నారు.
MLHP
నియామక పరీక్ష తేదీ ఇదే.. జోన్‌ల వారీగా ఖాళీలు ఇలా..

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌ అక్టోబర్‌ 21న ఒక ప్రకటన జారీ చేశారు. https://aphmfwmlhp.aptonline.inలో హాల్‌టికెట్‌లను అందుబాటులో ఉంచామన్నారు. కాగా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటిలో బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులను ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమించనుంది. ఇప్పటికే 8,351 పోస్టులను భర్తీ చేసింది. ఇవికాకుండా మరో 1,681 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి ఆగస్టులో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 11,992 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నియామక పరీక్షను 200 మార్కులకు నిర్వహించనున్నారు. బీఎస్సీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచి 200 ప్రశ్నలకు మలి్టపుల్‌ చాయిస్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష‌ నిర్వహిస్తారు. ఇందుకు మూడు గంటల వ్యవధి ఉంటుంది. 

చదవండి: ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు: మరో 7,000 పోస్టుల భర్తీకి కసరత్తులు!

జోన్‌ల వారీగా ఖాళీలు ఇలా.. 

  • జోన్‌–1 (ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం): 233 
  • జోన్‌–2 (ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా): 658
  • జోన్‌–3 (ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు): 494
  • జోన్‌–4 (ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు): 296

Published date : 22 Oct 2022 03:55PM

Photo Stories