ఈ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో.. ఎయిడెడ్ స్కూళ్ల బోధన, బోధనేతర సిబ్బంది, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు కూడా దాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నవంబర్ 30న గెజిట్ జారీ చేసింది.
ఈ నిర్ణయంపై ఎమ్మెల్సీ కల్పలతతో పాటు గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.మధుసూదనరాజు, ప్రధాన కార్యదర్శి పి.ఉగ్రసేను హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీఎంఈల వయోపరిమితి 65 ఏళ్లకు పెంపు
పలు ఎయిడెడ్ పాఠశాలల్లో సిబ్బంది సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గెజిట్‌కు అనుగుణంగా పాఠశాల విద్యా శాఖ వెంటనే ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని టీచర్స్ గిల్డ్ కోరింది.
Published date : 01 Dec 2022 01:53PM