Jobs: ఉన్నత విద్యలో సువర్ణాధ్యాయం
Sakshi Education
అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో సువర్ణ అధ్యాయం లిఖించింది.
యూనివర్సిటీల్లో దశాబ్దాలుగా భర్తీకి నోచుకోని అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఏకంగా 205 పోస్టులు భర్తీ కానున్నాయి.
ఇందులో 125 అసిస్టెంట్, 63 అసోసియేట్, 17 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఉన్నత విద్యా మండలి ఉమ్మడి పోర్టల్ ద్వారా అక్టోబర్ 31న నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది.
చదవండి: Andhra Pradesh : ఇకపై గ్రామ సచివాలయాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులకు..
ఎస్కేయూలో విభాగాల వారీగా పోస్టులు..
- అసోసియేట్ ప్రొఫెసర్ (రెగ్యులర్): బయోకెమిస్ట్రీ –2 (ఓసీ–1, ఎస్సీ–1). బయో టెక్నాలజీ –2 (ఓసీ–1, బీసీ(ఏ)–1), బోటనీ – 2 (ఓసీ–2), కెమిస్ట్రీ (ఎస్సీ–1, ఎస్టీ–1), సివిల్ ఇంజినీరింగ్–2 (ఓసీ–1, బీసీ(బీ)–1).
- కామర్స్–2 (ఓసీ–1,డబ్ల్యూఎస్–1), కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ –2 (ఓసీ–1, బీసీ(సీ)–1), కంప్యూటర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ –2 (ఓసీ–1, ఎస్సీ–1).
- ఎకనామిక్స్, అప్‌లైడ్ ఎకనామిక్స్ –2 (ఓసీ–1, బీసీ (డీ)–1), ఈఈఈ–2 (బీసీ–(ఈ)1, బీసీ–(ఏ)–1), ఈసీఈ –2 (ఈడబ్ల్యూఎస్–1, ఎస్సీ–1), ఇంగ్లిష్–2 (ఓసీ–1, బీసీ–(బీ)–1), జాగ్రఫీ–2 (ఎస్టీ–1, ఓసీ–1), లా – 1 (బీసీ(ఏ).
- లైబ్రరీ సైన్సెస్–1 (ఓసీ), మేనేజ్‌మెంట్ –2 (ఓసీ–1, ఈడబ్ల్యూఎస్–1), మేథమేటిక్స్ – 1 (ఎస్టీ), మెకానికల్ ఇంజినీరింగ్ – 2 ( ఓసీ–1, బీసీ(బీ)–1), మైక్రో బయాలజీ –2 (ఓసీ–2), ఫార్మాస్యూటికల్ సైన్సెస్–2 (ఓసీ – 1,బీసీ (డీ)–1).
- ఫిజికల్ ఎడ్యుకేషన్ – 2 (ఓసీ–1, ఎస్సీ–1), ఫిజిక్స్–1 (ఈడబ్ల్యూఎస్–1), ఎలక్ట్రానిక్స్–1 (బీసీ– (డీ)1), పొలిటికల్ సైన్సెస్ – 2 (బీసీ– (ఈ)1, బీసీ(ఏ–1).
- పాలిమర్ సైన్సెస్–2 (ఓసీ–1, ఎస్సీ–1), రూరల్ డెవలప్‌మెంట్ –1 (ఓసీ–1), సోషల్ వర్క్–1 (బీసీ(బీ)–1), సెరికల్చర్–2 (ఈడబ్ల్యూఎస్–1, ఓసీ–1).
- సోషియాలజీ–2 (ఎస్సీ–1, ఓసీ–1), స్టాటిస్టిక్స్–1 (బీసీ(ఏ)–1), తెలుగు –1 (ఓసీ–1), యూసిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ –1 (ఓ.సీ–1), జువాలజీ –2 (ఓసీ–1, ఎస్టీ–1).
- అసోసియేట్ ప్రొఫెసర్లు (బ్యాక్‌లాగ్)–2
- అసిస్టెంట్ ప్రొఫెసర్లు (రెగ్యులర్)– 107, బ్యాక్‌లాగ్ – 6 (హిస్టరీ, పొలిటికల్ సైన్సెస్, మైక్రోబయాలజీ, ఎలక్ట్రానిక్స్, పాలిమర్ సైన్సెస్, సెరికల్చర్).
- ప్రొఫెసర్ పోస్టులు 32 భర్తీ చేస్తున్నారు. ఎస్కే యూనివర్సిటీ ఏర్పడిన తరువాత ఇంతటి భారీ స్థాయిలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రతి విభాగానికి ఒక ప్రొఫెసర్ పోస్టును భర్తీ చేస్తున్నారు.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు రుసుము ఇలా..
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరి, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2 వేలు, ఎన్‌ఆర్‌ఐలు అయితే రూ. 4,200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ మూడు పోస్టులకు అర్హత ఉంటే విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే సబ్జెక్టు, ఒకే కేటగిరి అయితే ఒక దరఖాస్తుతో అన్ని యూనివర్సిటీల్లోని పోస్టులకూ పోటీపడవచ్చు. అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుకు రూ.3 వేలు దరఖాస్తు రుసుము నిర్దేశించారు.
- కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీ కల్పిస్తున్నారు.
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువు నవంబర్ 20.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్‌కు అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితాను నవంబర్ 30న ప్రదర్శిస్తారు.
- డిసెంబర్ –7న అభ్యంతరాల స్వీకరణ
- డిసెంటర్ 8న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు స్క్రీనింగ్ టెస్టుకు ఎంపికై న అభ్యర్థుల జాబితా ప్రదర్శన.
Published date : 02 Nov 2023 12:50PM