Guest Faculty: డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీకి అనుమతి
Sakshi Education
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫాకల్టీ) నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది.
తెలంగాణ కాలేజీ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ ఈమేరకు నవంబర్ 9న మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రతి కాలేజీలోనూ గెస్ట్ ఫ్యాకలీ్టని గుర్తించి, అర్హులను ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ చేసి ఉండాలని, లేదా నెట్, స్లెట్‌లలో ఏదైనా ఒకటి చేసి ఉండాలని నిబంధన విధించారు. ఈ అర్హతలు ఉన్నవారు లేకపోతే పీజీ 55 శాతం (ఎస్సీ, ఎస్టీ 50 శాతం)తో పాసై ఉండాలని పేర్కొన్నారు. ఈ నియామకం కేవలం 2021–22 విద్యా సంవత్సరానికే వర్తిస్తుందని స్పష్టంచేశారు.
చదవండి:
Japanese Language: జపనీస్ లాంగ్వేజ్‌పై శిక్షణ
Published date : 10 Nov 2021 03:41PM