Skip to main content

Jobs: ప‌లు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నర్సంపేట రూరల్‌ : నర్సంపేట మెడికల్‌ కళాశాలలో కాంట్రాక్ట్‌ పద్ధతిన ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సీనియర్‌ రెసిడెంట్లు, ట్యూటర్‌ పోస్టులకు సెప్టెంబర్ 11 నుంచి 13వరకు దరఖాస్తులకు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ సత్య శారద, నర్సంపేట మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌ దాస్‌ ఆదివారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
Applications are invited for various posts in the Medical College  Collector Satya Sharada and Principal Mohan Das of Narsampeta Medical College Announcement of job vacancies at Narsampeta Medical College  Application dates for contract-based posts at Narsampeta Medical College

నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో కాంట్రాక్టర్‌ పద్ధతిన ప్రొఫెసర్‌ 8, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 6, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 30, సీనియర్‌ రెసిడెంట్లు 18, ట్యూటర్స్‌ 3 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఒర్జినల్‌ సర్టిఫికెట్లతోపాటు, ఒక సెట్‌ జిరాక్స్‌ పత్రులను, రెండు పాస్‌ ఫొటోలను తీసుకోని నర్సంపేట మెడికల్‌ కళాశాలకు ఈనెల 11 నుండి 13 తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

చదవండి: Telangana High Court Orders : బ్రేకింగ్ న్యూస్‌.. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు...ఇక‌పై ఈ విద్యార్థులు కూడా ఈ కోట‌లోనే..

ఉదయం 9గంటల నుండి 2గంటల వరకే దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రూ.1.50 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రూ.1.25 లక్షలు, సీనియర్‌ రెసిడెంట్లకు రూ.92,575, ట్యూటర్లకు రూ.55 వేలు వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు కళాశాల వెబ్‌ సైట్‌ https:// www.gmcnarsampet.com లో ఉన్నాయని, దరఖాస్తు ఫామ్‌ డౌన్‌లోచేసుకుని పూర్తి చేసి మెడికల్‌ కళాశాలో అందించాలని సూచించారు.

Published date : 09 Sep 2024 03:18PM

Photo Stories