SSC Exam In Telugu: తెలుగులోనూ నాన్ టెక్నికల్ ఎస్‌ఎస్‌సీ పరీక్ష
Sakshi Education
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)–2022ను తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
భాష అవరోధం కారణంగా ఎవరూ అవకాశాలు కోల్పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషలను చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని జితేంద్ర సింగ్ తెలిపారు.
SSC Jobs Notification : 11409 ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్.. పదో తరగతి అర్హతతోనే.. పూర్తి వివరాలు ఇవే..
Published date : 21 Jan 2023 11:39AM