Skip to main content

7500 SSC Jobs : డిగ్రీ అర్హ‌త‌తో.. 7500 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి మే 3వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తుంది.
SSC Jobs 2023 telugu news
7500 SSC Jobs 2023 Details

ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎస్ఎస్‌సీ గ్రూప్‌ బి, గ్రూప్‌ సీ పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్న‌ది. దీని కోసం కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్షలను నిర్వహించనుంది.

చ‌ద‌వండి: SSC పరీక్షల స్టడీ మెటీరియల్

భ‌ర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..

ssc jobs 2023 details in telugu

ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఆడిట్ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో సహా పలు శాఖల్లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, సీబీడీటీలో ఇన్‌కం ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌, సీబీఐలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, ఎన్‌హెచ్ఆర్‌సీలో రీసెర్చి అసిస్టెంట్‌, ఎన్‌ఐఏలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోలో  సబ్‌ ఇన్‌స్పెక్టర్‌/ జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌, కాగ్‌లో ఆడిటర్‌, అకౌంటెంట్‌, తపాలాశాఖలో పోస్టల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, సీబీడీటీలో ట్యాక్స్‌ అసిస్టెంట్‌, నార్కొటిక్స్‌ బ్యూరో, ఆర్థికమంత్రిత్వశాఖలో  సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

☛ కేంద్ర సాయుధ బలగాల్లో 54,953 కానిస్టేబుల్ ఉద్యోగాలు

అర్హ‌త‌లు : 
డిగ్రీ అర్హత

జీతం : 
నెలకు రూ.25,500ల నుంచి రూ.1,51,100 (ఆయా పోస్టులను బట్టి)

వయో పరిమితి : 
ఆయా ఉద్యోగాలకు కనీస వయసు 18 ఏళ్లు. గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు,  ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు వయో సడలింపు కల్పించారు. వీరితో పాటు దివ్యాంగులకు ప్రత్యేకంగా వయో సడలింపు ఇచ్చారు.

దరఖాస్తు ఫీజు :

రూ.100గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కేటగిరీకి చెందిన వారు దరఖాస్తు రుసుం చెల్లించనవసరంలేదు. దరఖాస్తు రుసుం రిఫండ్‌ లేదు. 

ఎంపిక విధానం :
రెండు దశల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. టైర్‌ 1 పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది. టైర్‌ 2 పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటాయి.

చ‌ద‌వండి: SSC Exam Syllabus

ముఖ్యమైన తేదీలివే..

ssc exam dates 2023

ఫీజు చెల్లింపునకు చివ‌రి గడువు : మే 4 రాత్రి 11 గంటల వరకు
దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు చివ‌రి తేదీ : మే 7వ తేదీ నుంచి 8 వరకు
టైర్ 1 ప‌రీక్ష : కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష జులైలో ఉంటుంది
టైర్ 2 ప‌రీక్ష : తేదీలను తర్వాత ఖరారు చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే..
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

ఎస్ఎస్‌సీ 7500 ఉద్యోగాల‌కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారం ఇదే..

Published date : 04 Apr 2023 01:21PM
PDF

Photo Stories