Skip to main content

కేంద్ర సాయుధ బలగాల్లో 54,953 కానిస్టేబుల్ ఉద్యోగాలు

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది.
దేశభద్రతకు ఆయువుపట్టు లాంటి వివిధ భద్రతా దళాలలో 54,953 కానిస్టేబుల్ పోస్టుల్లోకి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) రంగం సిద్ధం చేసింది. దీని ద్వారా కేవలం పదోతరగతి విద్యార్హతతోనే కేంద్ర కొలువు దక్కించుకునే సువర్ణ అవకాశం లభిస్తుంది.

ఖాళీల వివరాలు...
  • మొత్తం పోస్టుల సంఖ్య: 54,953 (పురుషులకు 47,307, మహిళలకు 7,646).
  • విభాగాలవారీగా పోస్టులు:
  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్)-16,984
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)- 200
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)- 21,566
  • సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ)- 8,546, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)-4,126
  • అస్సాం రైఫిల్స్(ఏఆర్)-3,076
  • నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)-8
  • సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్)- 447

పేస్కేల్: రూ.21,700-69,100
అర్హత: 2018 ఆగస్టు1 నాటికి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2018 ఆగస్టు 1 తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ).. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు(పీఎస్‌టీ)లకు ఆహ్వానిస్తారు. పీఈటీలో భాగంగా పురుష అభ్యర్థులు ఐదు కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. మహిళలు ఎనిమిదిన్నర నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి.

పరీక్ష ఇంగ్లిష్, హిందీలో మాత్రమే :
1. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం గంటన్నర.
2. జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్‌‌జ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, హిందీ లేదా ఇంగ్లిష్.. ఇలా నాలుగు విభాగాలు ఉంటాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది.

జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్ :
ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో పదాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం, దాన్ని విశ్లేషించడం, దిశలు, రక్తసంబంధాలు, వెన్‌చిత్రాలు, నంబర్ సిరీస్, ర్యాంకింగ్, లాజికల్ రీజనింగ్, కోడింగ్- డీకోడింగ్, అర్థమెటిక్ నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు నాన్ వెర్బల్ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. గత ప్రశ్న పత్రాల సాధన, మాక్ టెస్టులు రాయడం ద్వారా ఈ సెక్షన్‌లో మంచి స్కోరు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

జనరల్ నాలెడ్‌‌జ - జనరల్ అవేర్‌నెస్ :
ఈ సెక్షన్‌లో కరెంట్ అఫైర్స్‌తోపాటు జనరల్ నాలెడ్‌‌జ మిళితమై ఉంటుంది. జనరల్ స్టడీస్‌లో.. ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని మార్పులు మొదలైన అంశాల్లో అభ్యర్థులకున్న పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. అంతర్జాతీయ పరిణామాలు, అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సదస్సులు-నిర్వహించిన దేశాలు-పాల్గొన్న దేశాలు, అవార్డులు, క్రీడలు, ప్రముఖ పుస్తకాలు-రచయితలు, వార్తల్లో వ్యక్తులు, ఆర్థికం, ముఖ్య తేదీలు మొదలైనవి చదవాలి.

ఎలిమెంటరీ మ్యాథ్స్ :
ఇందులో నంబర్ సిస్టమ్స్, భిన్నాలు, బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, శాతాలు, రేషియో-ప్రపొర్షన్, సగటు, కసాగు-గసాభా, శాతాలు, లాభనష్టాలు, కాలం-దూరం, రైళ్లు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-పని, మెన్సురేషన్ మొదలైన ప్రాథమిక స్థాయి అధ్యయాల నుంచి గణిత ప్రశ్నలు వస్తాయి.

ఇంగ్లిష్/హిందీ :
ఇందులో అభ్యర్థుల ప్రాథమిక భాష నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఆర్టికల్స్, టెన్సెస్, వొకాబ్యులరీ, గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ అంశాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2018 ఆగస్టు 20(సాయంత్రం 5 గంటల వరకు).
దరఖాస్తు రుసుం: రూ.100(మహిళా అభ్య ర్థులకు, ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రుసుం నుంచి మినహాయింపు ఉంటుంది).
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://ssconline.nic.in
Published date : 23 Jul 2018 06:40PM

Photo Stories