Skip to main content

SSC Exams: సీజీఎల్‌–2021 పరీక్ష విధానం, అర్హతలు, సిలబస్, ప్రిపరేషన్‌ టిప్స్‌..

SSC CGL 2021 Notification
SSC CGL 2021 Notification

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలతో పాటు పలు రాజ్యాంగ/చట్టబద్ధమైన సంస్థలు, ట్రైబ్యునల్స్‌లో గ్రూప్‌–బి, గ్రూప్‌–సి పోస్టుల్లో చేరేందుకు మార్గం.. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) ఎగ్జామినేషన్‌. జాతీయ స్థాయిలో ఈ పరీక్షను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నిర్వహిస్తోంది. నాలుగు దశల్లో నిర్వహించే ఈ పరీక్షకు ఏటా దేశవ్యాప్తంగా విపరీతమైన పోటీ నెలకొంది. తాజాగా సీజీఎల్‌–2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. పరీక్ష విధానం, అర్హతలు, సిలబస్, ప్రిపరేషన్‌ ప్రణాళికపై ప్రత్యేక కథనం...

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పరీక్ష ద్వారా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) పరిధిలోని ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్, సెంట్రల్‌ సెక్రటేరియెట్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రైల్వే మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాలు, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వంటి విభాగాల్లో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర హోదాల్లో గ్రూప్‌–బి, గ్రూప్‌–సి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

అర్హతలు

  • బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. 
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు బ్యాచిలర్‌ డిగ్రీ చదివిన వారు అర్హులు. 
  • చార్టర్డ్‌ అకౌంటెంట్‌ లేదా కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ లేదా కంపెనీ సెక్రటరీ లేదా కామర్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఫైనాన్స్‌)/బిజినెస్‌ ఎకనామిక్స్‌లో మాస్టÆŠ్స పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. 
  • జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఇంటర్మీడియెట్‌ స్థాయిలో గణితంలో 60శాతం మార్కులు సాధించి.. ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారు అర్హులు. లేదా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయసు: పోస్టులకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిని 27ఏళ్లు/30 ఏళ్లు/32 ఏళ్లుగా నిర్ణయించారు. 


Also Read: SSC Exams Guidance

ఎంపిక విధానం

  • టైర్‌–1, టైర్‌–2, టైర్‌–3, టైర్‌–4 అనే నాలుగు అంచెలుగా పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టెర్‌–4 పరీక్షలను సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే రాయాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం

టైర్‌–1:

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25 50
జనరల్‌ అవేర్‌నెస్‌ 25 50
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25 50
ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ 25 50
  • ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌)లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్, మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగంలో 50 మార్కులకు 25 ప్రశ్నల చొప్పున మొత్తం నాలుగు విభాగాల్లో 200 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 1 గంట.
  • నెగెటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. 

టైర్‌–2: 

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
పేపర్‌–1: క్వాంటిటేటివ్‌ ఎబిలిటీస్‌ 100 200
పేపర్‌–2: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 200 200
పేపర్‌–3: స్టాటిస్టిక్స్‌ 100 200
పేపర్‌–4: జనరల్‌ స్టడీస్‌ (ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌)  100 200
  • ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌)లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్, మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. దీనిలో నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ కాలవ్యవధి 2 గంటలు.
  • నెగెటివ్‌ మార్కుల విధానం ఉంది.పేపర్‌ 1,3,4లలో ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. పేపర్‌ 2 (ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌)లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.

టైర్‌–3:

  • టైర్‌–3 పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌ మోడ్‌(డిస్క్రిప్టివ్‌ పేపర్‌)లో 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఒక గంట.

టైర్‌–4:

  • టైర్‌–4లో కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌(సీపీటీ), డేటాఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌(డీఈఎస్‌టీ) నిర్వహిస్తారు.

ప్రిపరేషన్‌ ఇలా

  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగంలో.. అభ్యర్థుల తార్కిక శక్తి, విశ్లేషణ నైపుణ్యం, ఆలోచనల్లో స్పష్టతను పరీక్షించేలా ప్రశ్నలు ఇస్తారు. ఈ సెక్షన్‌లో సమాధానాలు గుర్తించేటప్పుడు గందరగోళానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి. మాక్‌ టెస్టులు రాస్తూ కచ్చితత్వాన్ని పెంచుకోవాలి. క్యాలెండర్‌ చాప్టర్‌లో ఫార్ములాలు జాగ్రత్తగా గుర్తించుకోవాలి. 
  • క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగాల్లోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు అధిక సమయం అవసరమవుతుంది. కాబట్టి వీలైనంత తక్కువ సమయంలో సమస్యలను సాధించేలా ప్రాక్టీస్‌ చేయాలి. క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌.. టైర్‌–1లో 50మార్కులకు, టైర్‌–2లో 200 మార్కులకు ఉంటుంది. అత్యంత ప్రధానమైన సబ్జెక్టు ఇది. ఎంతో ప్రాక్టీస్, ప్రాథమిక భావనలపై గట్టి పట్టు ఉంటేనే స్కోరు చేయడానికి ఆస్కారం ఉంటుంది. 
  • జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో చుట్టూ ఉన్న వాతావరణం, సమాజానికి సంబంధించి అభ్యర్థుల అవగాహనను పరీక్షించే లక్ష్యంగా ప్రశ్నలు అడుగుతారు. ప్రస్తుత సంఘటనల పరిజ్ఞానాన్ని, రోజువారీ పరిశీలనా నైపుణ్యాలను, జ్ఞానాన్ని అంచనావేసేలా ప్రశ్నలు ఇస్తారు. వీటిలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, ఆర్థిక అంశాలు, శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించినవి ఉంటాయి.
  • ఇంగ్లిష్‌లో అభ్యర్థులు గ్రామర్‌ రూల్స్‌తోపాటు, వొకాబ్యులరీపై పట్టు పెంచుకుంటే ఈ విభాగంలో మంచి స్కోరు చేయొచ్చు.
  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ కోసం బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ తదితర పరీక్షల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో ఇండియన్‌ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, అవార్డులు–నియామకాలు, క్రీడలు–విజేతలు తదితర అంశాలను చదవాలి. 


Also Read: Study Material

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరితేది: 2022 జనవరి 23
  • టైర్‌–1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: 2022 ఏప్రిల్‌లో
  • టైర్‌–2 పరీక్ష: తేదీలు తర్వాత ప్రకటిస్తారు
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌: చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌
  • వెబ్‌సైట్‌: https://ssc.nic.in


Also Read: Syllabus

Published date : 29 Dec 2021 06:26PM

Photo Stories