Skip to main content

Good News for Students: ఈనెల 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana government announced holiday
Telangana government announced holiday

2024, సెప్టెంబర్ నెలలో.. 7, 17వ తేదీలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి పండుగలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Airport jobs news: ఇంటర్‌ అర్హతతో ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా ఉద్యోగాలు జీతం 45వేలు: Click Here

ఉత్తర్వులు జారీ
సెప్టెంబర్ 7వ తేదీ గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 17న మిలాద్ ఉన్ నబీకి హాలీడే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తెలంగాణ సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. 7వ తేదీ గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీకి సెలవుగా డిక్లేర్ చేశారు.

అయితే, నెలవంక దర్శనం తేదీని బట్టి మిలాద్ ఉన్ నబీ హాలీ డే డేట్ మారింది. మొదట నిర్ణయించిన 16న కాకుండా.. 17వ తేదీని మిలాద్ ఉన్ నబీ హాలీడే గా ప్రభుత్వం తాజాగా డిక్లేర్ చేసింది. ఈ నెల 7వ తేదీన గణేష్ వినాయక చవిత ప్రారంభం కానుండగా.. 17న నిమజ్జనం జరగనుంది.

17న వినాయక నిమజ్జనం జరగనుండటంతో అదే తేదీన జరగాల్సిన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 19వ తేదీన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Published date : 05 Sep 2024 08:31PM

Photo Stories