Teachers Suspension: ఆకస్మిక తనిఖీలో టీచర్ల సస్పెన్షన్.. కారణం..?
సాక్షి ఎడ్యుకేషన్: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్ జిల్లాలోని పలు పాఠశాలల ఆకస్మిక తనిఖీలో గుర్తించిన లోపాలకు బాధ్యులను చేస్తూ ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులు, ఒక యూపీ పాఠశాల హెచ్‌ఎంకు చార్జెస్ ప్రేమ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం నగరం తారకరామకొట్టాలలోని వైఎస్సార్ నగరపాలక ప్రాథమిక పాఠశాల టీచరు వర్క్‌బుక్ కరెక్షన్‌లో కనబరిచిన నిర్లక్ష్యంపై టీచరు భాగ్యలక్ష్మిపై సస్పెన్షన్ వేటు వేశారు.
➤ TS Schools : స్కూల్‌కి సెలవు.. ఆధార్‌కి లింక్.. ఎందుకంటే..?
3, 4 తరగతులను కలిపి ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తుండడంతో ఆత్మకూరు మండలం పి.యాలేరు ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం జయమణిని సస్పెండ్ చేశారు. మిగులు టీచర్లగా ఉన్నవారిని సర్దుబాటు చేయకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా అనంతపురం ఎంఈఓ వెంకటస్వామి, ఆత్మకూరు ఎంఈఓ నరసింహారెడ్డిలపై చార్జెస్ ఫ్రేమ్ చేశారు. టీచర్లను సమన్వయం చేసుకోవడంలో అలసత్వం ప్రదర్శించిన అనంతపురం నెహ్రూ యూపీ స్కూల్ హెచ్‌ఎం గంగాధర్‌పై కూడా చార్జెస్ ఫ్రేమ్ చేసినట్లు డీఈఓ నాగరాజు తెలిపారు.