Quality Education: విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించే బాధ్యత ఉపాధ్యాయులదే..
శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం ద్వారా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందుతుందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపతిరావు కిశోర్‌కుమార్ అన్నారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎల్.బాబూరావు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కిశోర్‌కుమార్ మాట్లాడుతూ పాఠశాలలు ఈనెల 13వ తేదీ పునఃప్రారంభం కానున్నాయని, పాఠశాలల్లో చేరే విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు.
Silver CET 2024: సిల్వర్ సెట్ పరీక్షకు గడువు పొడగింపు.. చివరి తేదీ ఇదే!
ఇందుకోసం ప్రత్యేక అడ్మిషన్స్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు గ్రామాల్లో చేపట్టాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏర్పడిన నూతన ప్రభుత్వానికి యూటీఎఫ్ తరఫున అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. జీఓ నంబర్ 117 రద్దు చేయాలన్నారు. గత సంవత్సరంలో 4600 ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న మూడు, నాలుగు, ఐదు తరగతుల్ని ఒక కిలోమీటర్‌లోపు ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారని, తక్షణమే ఆ విద్యార్థులందరినీ తిరిగి మాతృ పాఠశాలకి పంపించాలన్నారు.
DRDO Recruitment: రాత పరీక్ష లేకుండా DRDOలో ఉద్యోగం.. నెలకు రూ.40 వేల వరకు జీతం