విద్యార్థులను చితకబాదిన టీచర్
పాఠశాలలో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు తిరుపతి 8వ తరగతి చదివే 25మంది విద్యార్థులు అల్లరిచేశారనే నెపంతో చితకబాదాడు. ఒకరిద్ద రు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విష యం తెలిసిన మిగితా తల్లిదండ్రులు కూడా పెద్దఎత్తున పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు.
త్రీటౌన్ సీఐ శ్రీనివాస్ వారిని సముదాయించారు. తిరుపతిని అప్పగించాలని తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. తిరుపతిని తోటి ఉపాధ్యాయులు ఒకరూంలో ఉంచి పోలీసులు వ చ్చాక వారికి అప్పగించారు. ఇదే సమయంలో ఏబీ వీపీ నాయకులు టీచర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
పోలీసులు వా రిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు తిరుపతిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని త్రీటౌన్ సీఐ వెల్ల డించారు. ఈ విషయమై డీఈవో జనార్దన్‌రావును వివరణ కోరగా ఎంఈవో మధుసూదనాచారితో విచారణ నిర్వహించామని, 7వ తరగతి విద్యార్థులకు పాఠం బోధిస్తుండగా 8వ తరగతి విద్యార్థులు అల్లరి పెడుతుంటే టీచర్ తిరుపతి వారిని దండించడంతో పాటు దూషించాడని విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
విచారణ అనంతరం ఉపాధ్యాయుడు తిరుపతిని సస్పెండ్ చేసినట్లు డీఈవో వెల్ల డించారు. కాగా.. పాఠశాల ఎదుట ఆందోళన చేస్తుంటే త్రీ టౌన్ సీఐ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ భర్త ఎడ్ల అశోక్ తమతో దురుసుగా ప్రవర్తించారని ఏబీవీపీ నేతలు ఏసీపీ నరేందర్‌కు ఫిర్యాదు చేశారు.