Police Officers Offer Scholarships: పోలీస్ సిబ్బందిచే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
సాక్షి ఎడ్యుకేషన్: కష్టపడి చదివినప్పుడే నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోగలరని జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ అన్నారు. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బంది పిల్లలకు శుక్రవారం మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందజేశారు. చదువుకుంటున్న పోలీస్ సిబ్బంది పిల్లల్లో పదవ తరగతి, ఇంటర్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్‌లలో 2021–22 గానూ మంచి మార్కులు సాధించిన 31 మందికి రూ.5,56,000 మెరిట్ స్కాలర్ షిప్‌ను పోలీసు సంక్షేమ నిధి నుంచి అందజేశారు.
National Scholarship Portal: వెరిఫై అప్లికేషన్ లకు మాత్రమే స్కాలర్‌షిప్
ప్రతి సంవత్సరం పోలీసు సంక్షేమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కార్యాలయం నుంచి ప్రతి జిల్లాలోని పోలీస్ సిబ్బంది పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్‌లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఈ నగదును చెక్కుల రూపంలో అందజేసేవారిమని, ప్రస్తుతం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా పోలీస్ శాఖ అమలు పరుస్తున్న కార్యక్రమాలను పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి.మహేష్, వెల్ఫేర్ ఆర్‌ఐ బి.శ్రీకాంత్‌నాయక్, బి సెక్షన్ సూపరింటెండెంట్ కె.రాధా, పోలీసు సిబ్బంది పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.