Skip to main content

AP Students Education: పేద విద్యార్థులకు పథకాలతో చదువు ప్రోత్సాహం

ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి పిల్లలను బడిలోకి పంపేందుకు వెనకబడిన తల్లిదండ్రులకు ఏపీ ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేసింది. విద్యా పథకాలతో వారి పిల్లలు ఇప్పుడు బడికి వెళ్లి చదువుకుంటున్నారని వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు..
Students Education in AP with the help of schemes

పాడేరు: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న అమ్మ ఒడి పథకం నిరుపేద విద్యార్థుల చదువులకు భరోసాగా నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందించింది. ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమైన వారంతా అమ్మ ఒడి ఉందనే ధీమాతో మళ్లీ బడిబాట పట్టారు.

Inter Results 2024 Release Date : ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం.. ఫలితాల విడుదల ఎప్పుడంటే..?

అమ్మ ఒడికి అర్హతే ప్రామాణికం

విద్యార్థుల చదువులకు తోడ్పాటు అందించాలనే ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతున్నప్పటికీ అర్హతే ప్రామాణికంగా అమ్మ ఒడి మంజూరు చేశారు. పథకం పారదర్శకంగా అమలు చేసే క్రమంలో సచివాలయం స్థాయిలో లబ్ధిదారుల ఈకేవైసీ ధ్రువీకరణ, ఆధార్‌ కార్డు అనుసంధానంతో ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మధ్యవర్తులు లేకుండా.. నేరుగా లబ్ధిదారులకు డబ్బులు అందుతున్నాయి.

School Development: అభివృద్ధి చెందిన పాఠశాలలు..

ప్రతీ విద్యార్థికి రూ.60 వేలు

ఏటా ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి అమలైంది. ఏడాదికి రూ.15వేలు చొప్పున ప్రతీ విద్యార్థికి ప్రభుత్వం మొత్తంగా రూ.60 వేలు అందజేసింది. ముందస్తు షెడ్యూల్‌ మేరకు 2023–24కు సంబంధించి మరో రూ.15 వేలు ఈ వేసవి సెలవులు అనంతరం స్కూళ్లు తెరిచిన తర్వాత తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

Gurukul Teacher Jobs: భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?

విద్యాకానుకతో ధీమా

జగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌, నోట్‌ పుస్తకాలు, బూట్లు, షూస్‌, సాక్స్‌, యూనిఫాం (మూడు జతలు) ఇలా తొమ్మి రకాల వస్తువులను ఇస్తున్నారు. ఒక్కో కిట్‌కు రూ.1,964లు ఖరీదు చేయనుండగా, ఏటా జిల్లాలో లక్ష మందికి పైగా పంపిణీ చేస్తున్నందుకు గానూ ప్రభుత్వం ఏడాదికి రూ.20 కోట్ల వరకు చెల్లిస్తోంది.

TSGENCO: 31న జెన్‌కో ఏఈ, కెమిస్ట్‌ పరీక్షపై సందిగ్ధం

పథకం వివరాలు

సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఆర్థిక లబ్ధి(రూ.కోట్లలో)

2019–20 96,250 144,37,50,000

2020–21 98,126 147,18.90,000

2021–22 99,706 149,55,90,000

2022–23 1,01,170 151,75.50,000

మొత్తం 3,195,172 592,87,80,000

Scout and Guides: విద్యార్థుల క్రమశిక్షణకు స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌..

ఆదుకున్న ప్రోత్సాహం

మా కుమార్తె గీతాంజలి కుమ్మరివీధి ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. 2019లో చేరినప్పటి నుంచి అమ్మ ఒడి పథకంలో ఏడాదికి రూ.15 వేల చొప్పున మా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ మొత్తాన్ని కుమార్తె చదువుకు వెచ్చిస్తున్నాం. చదివించడం భారంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న సాయం మాకు ఎంతగానో ఉపయోగపడింది.

– పూర్ణిమ, కొండబాబు.. తల్లిదండ్రులు, కుమ్మరివీధి, పెదబయలు మండలం

Free Education: ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పెంపు

చదువుకు ఆర్థిక భరోసా

హుకుంపేట కేజీబీవీలో టెన్త్‌ చదువుతున్న మా కుమార్తె లలితకు అమ్మ ఒడి పథకంతో ఎంతో మేలు జరిగింది. ఏటా రూ.15 వేల చొప్పున నా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడంతో ఆర్థిక అవసరాలు ఎంతో తీరాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మా లాంటి పేద కుటుంబాలు రుణపడి ఉంటాం.

– పాంగి గున్నమ్మ, గరుడాపల్లి, హుకుంపేట మండలం

Quiz of The Day (March 25, 2024): పార్లమెంట్ సార్వభౌమాధికార సంస్థ కాదు. కారణం ఏమిటి?

Published date : 25 Mar 2024 01:39PM

Photo Stories