Skip to main content

Collector Prashanth Jeevan Patil: ‘మన బడి’ పనుల్లో అలసత్వం వద్దు

Collector Prashanth Jeevan Patil

సిద్దిపేటరూరల్‌: గజ్వేల్‌ నియోజకవర్గంలో జరుగుతున్న మన ఊరు మనబడి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఈ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మన ఊరు మన బడి పనులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్క ఈజీఎస్‌ పనులు మినహా దాదాపు పూర్తికావొచ్చాయని అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఈజీఎస్‌ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు(రన్నింగ్‌ వాటర్‌), కిచెన్‌ షెడ్‌, సంపులు పూర్తి చేశాకే ప్రహరీ, అదనపు తరగతి గదులు, భోజనశాల పనులు పూర్తి చేయాలన్నారు. ఈ పథకంలో కొత్తగా చేర్చిన డ్రైనింగ్‌ హాల్‌ పనులను పూర్తి చేయాలన్నారు. సివిల్‌ పనుల్లో అలసత్వం చూపే కాంట్రాక్టర్లను మార్చాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌ రెడ్డి, డీఈఓ శ్రీనివాస్‌ రెడ్డి, ఈడబ్య్లుఐడీసీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Collector P.Uday Kumar: 290 పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం

సమన్వయంతో పనిచేయాలి
జిల్లాలోని టీఎన్‌జీఓ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ టీఎన్‌జీఓలకు సూచించారు. బుధవారం ఆ సంఘం సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్‌, కార్యదర్శి విక్రంరెడ్డి, నరేష్‌, నగేష్‌, శశిధర్‌ పాల్గొన్నారు.

Published date : 27 Jul 2023 03:49PM

Photo Stories