Science Quiz Winners: జిల్లాస్థాయి క్విజ్ పోటీల్లో విజేతలు వీరే..
కోలారు: విజ్ఞాన దినోత్సవంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర జ్ఞాన విజ్ఞాన సమితి నిర్వహించిన 5వ సంవత్సర సర్ సీవీ రామన్ క్విజ్ పోటీల్లో జిల్లాకు రాష్ట్రంలో మూడో స్థానం లభించింది. బంగారుపేటె తాలూకా కనమనహళ్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని మహాలక్ష్మి రాష్ట్ర అవార్డును దక్కించుకుంది.
13th Graduation Day: వ్యవసాయ వర్సిటీలో స్నాతకోత్సవం వేడుకలు..
జిల్లా స్థాయిలో మాలూరు బసవేశ్వర పాఠశాల విద్యార్థిని సహన ప్రథమ స్థానం, శ్రీనివాసపుర తాలూకా యల్దూరు ఉన్నత పాఠశాల విద్యార్థిని తేజస్విని రెండో స్థానం, వేమగల్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని జయశ్రీ మూడో స్థానం పొందారని సమితి జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థుల సాధనను జ్ఞాన విజ్ఞాన సమితి జిల్లా నాయకులు కేసీ పద్మావతి, సురేష్, శరణప్ప జమాదార్, అమరేష్‌బాబు ప్రశంసించారు.
Doctor Posts: వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానంలో పోస్టుల భర్తీ..