Academic Examination: 23 నుంచి విద్యార్థులకు పరీక్షలు
పుట్టపర్తి అర్బన్: పాఠశాల విద్య అకడమిక్ పరీక్షల క్యాలెండర్‌ను విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ విడుదల చేశారు. ఈ మేరకు డీఈఓ మీనాక్షి ఆదివారం తెలిపారు. ఈ నెల 23 నుంచి 28 వరకూ 1 నుంచి 9 వ తరగతి వరకూ ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు, ఈ నెల 23 నుంచి మార్చి 1వరకూ 10వ తరగతి ఫ్రీఫైనల్ రోజుకు రెండు చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకూ 23వ తేదీ తెలుగు, లెక్కలు, 24న ఎన్విరానిమెంటల్ సైన్స్, ఇంగ్లిష్ పార్ట్–ఏ, పార్ట్–బి, 26న 3 నుంచి 5వ తరగతి వరకూ ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు ఉంటాయి. అలాగే 6 నుంచి 8 వ తరగతి వరకూ 23న తెలుగు, లెక్కలు, 24న హిందీ, జనరల్ సైన్స్, 26న సోషల్, 27న ఇంగ్లిషు పార్ట్–ఏ, ఇంగ్లీషు పార్ట్–బీ, 28న ఓఎస్‌ఎస్‌సీ –1, 2 ఉంటాయి. 9వ తరగతికి 23న తెలుగు, లెక్కలు, 24 హిందీ, జనరల్ సైన్స్, 26న సోషల్, 27న ఇంగ్లిషు పార్ట్–ఏ, మధ్యాహ్నం పార్ట్–బీ ఉంటాయి. 23వ తేదీ 10వ తరగతి తెలుగు, 24న హిందీ, 26న ఇంగ్లిషు, 27న లెక్కలు, 28న ఫిజికల్ సైన్స్, 29న బయాలజికల్ సైన్స్, మార్చి 1న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి.
చదవండి: National Teachers Award 2023: ఉపాధ్యాయురాలికి జాతీయ ఇన్నోవేటివ్ అవార్డు