Skip to main content

National Teachers Award 2023: ఉపాధ్యాయురాలికి జాతీయ ఇన్నోవేటివ్‌ అవార్డు

National Innovation Award for Teacher

కురిచేడు: మండలంలోని బోదనంపాడు ఎస్సీ కాలనీలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు వల్లెంస్వాతికి జాతీయ ఇన్నోవేటివ్‌ ఎడ్యుకేషన్‌ రత్న 2023 అవార్డు లభించింది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన నవాచారి విద్యా ఇన్నోవేటివ్‌ టీచర్స్‌ సమూహ సంస్థ అవార్డు అందజేసింది. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు, గుణాత్మక విద్య, నైతిక విలువలు పెంపొందించడంతో పలు విద్య, సామాజిక సేవల్లో పాల్గొన్నందుకు అవార్డు అందజేసినట్లు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 700 మంది దరఖాస్తు చేసుకోగా 111 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. అందులో స్వాతికి అవార్డు లభించింది.

చదవండి: AP TRT: ఏపీలో సంక్షేమ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 19 Feb 2024 03:38PM

Photo Stories