Skip to main content

Child Protection: ‘బాలల కోసం ఒక రోజు’పై సమీక్ష

పర్లాకిమిడి: జిల్లా శిశు సురక్షా కేంద్రం ఆధ్వర్యంలో ‘బాలల కోసం ఒక రోజు’ అనే కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ స్మృతి రంజన్‌ ప్రధాన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలో అనాథ బాలల సంరక్షణ, ఉన్నత విద్యపై సమీక్షించారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు
సమావేశంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

బాల్య వివాహాలు, దత్తత, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు పంచాయతీ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. ఈ విద్యా సంవత్సరంలో (2022–23) పదో తరగతిలో ఉత్త మ మార్కులు సాధించిన బాలలకు రూ.4 వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆర్‌కే దాస్‌, జిల్లా శిశు సురక్షాధికారి అరుణ్‌ కుమార్‌ త్రిపాఠి, జిల్లా శ్రమ అధికారి లోకనాథ పండా, కాశీ గర్‌ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, కాశీనగర్‌ ఎన్‌ఏఈ చైర్మన్‌ మేడిబోయిన సుధారాణి తదితరు లు పాల్గొన్నారు.

Also read: Jobs: గురుకులాల్లో Part time lecturer పోస్టుల భర్తీ

Published date : 03 Aug 2023 08:10PM

Photo Stories