Skip to main content

Schools start in AP: పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా

Schools start in AP: పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా
Schools start in AP: పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా

అమరావతి: ఈ ఏడాది పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కా­వా­ల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే తేదీన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిసింది. దీంతో గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్‌తో కూడిన విద్యా కానుక కిట్లు అందజేసింది. ఇలా వరుసగా నాలుగేళ్లు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం కానుంది. పుస్తకాలు మండల కేంద్రాలకు చేరినా నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read:  ఏపీలో స్కూల్స్‌ రీ-ఓపెన్‌ తేదీ పొడిగింపు ఉత్తర్వులు జారీ

 పాఠశా­ల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు సగం మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ కిట్‌లో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్‌ వర్క్‌బుక్, ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్ట్‌ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్‌ బ్యాగ్, బెల్ట్, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్‌ డిక్షనరీ, 6–10 తరగతులకు నోట్‌బుక్స్‌ ఉన్నాయి.

మొదటి సెమిస్టర్‌కు 3.12 కోట్ల పుస్తకాలు 
ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. కాగా, మొ­దటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు దాదాపు మండల స్టాక్‌ పాయింట్లకు చేరాయి. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడూ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది. అలాగే, 3–10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్‌ సిలబస్‌ పుస్తకాలను అందించనున్నారు.

పదో తరగతి సాంఘికశా్రస్తాన్ని సీబీఎస్‌ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్‌ సైన్స్‌ పుస్తకాలను ఆర్ట్‌ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్‌ స్కిల్స్‌ కోర్సును అందుబాటులోకి తెచి్చంది. ఈ బోధనకు అనుగుణంగా మొత్తం 4.30 లక్షల పుస్తకాలు సైతం ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published date : 11 Jun 2024 11:04AM

Photo Stories