AP Schools Re Open Postponed: పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా.. ఇదే కారణం!
అమరావతి: ఈ ఏడాది పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే తేదీన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిసింది. దీంతో గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్‌తో కూడిన విద్యా కానుక కిట్లు అందజేసింది. ఇలా వరుసగా నాలుగేళ్లు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం కానుంది. పుస్తకాలు మండల కేంద్రాలకు చేరినా నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు సగం మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ కిట్‌లో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతులకు నోట్‌బుక్స్ ఉన్నాయి.
మొదటి సెమిస్టర్‌కు 3.12 కోట్ల పుస్తకాలు
ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. కాగా, మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు దాదాపు మండల స్టాక్ పాయింట్లకు చేరాయి. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడూ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది. అలాగే, 3–10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు.
Ultimate Fighting Championship: యూఎఫ్‌సీ చరిత్రలో భారత్ తొలి విజయం ఇదే..!
పదో తరగతి సాంఘికశాస్త్రాన్ని సీబీఎస్‌ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచి్చంది. ఈ బోధనకు అనుగుణంగా మొత్తం 4.30 లక్షల పుస్తకాలు సైతం ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
AP EAMCET Results 2024: నేడే ఏపీ ఎంసెట్ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి
Tags
- AP Schools
- re open
- postponed
- AP Schools re open date
- AP Govt Orders
- School Students
- State government
- June 13th
- ap schools re open
- Education News
- Sakshi Education News
- Amaravathi District News
- AP Schools Reopen updates
- Amaravati
- AcademicYear2024_25
- Postponement
- Authorities
- date announcement
- Wednesday
- Thursday
- Education
- StartDate
- ScheduleChange
- SakshiEducationUpdates
- Amaravati
- AcademicYear2024-25
- Postponement
- Announcement
- Thursday
- Wednesday
- SakshiEducationUpdates