Quiz Competitions: పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు
సాక్షి ఎడ్యుకేషన్: రిలయన్స్ ధీరూబాయి అంబానీ సంస్థ ఆధ్వర్యాన 8, 9, 10 తరగతుల విద్యార్థులకు స్థానిక సత్యనారాయణ గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ పోటీలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకశక్తిని, ప్రతిభను వెలికితీసేవి క్విజ్ పోటీలేనని అన్నారు. పోటీతత్వం ఉన్నప్పుడే నేర్చుకోవాలన్న జిజ్ఞాస విద్యార్థుల్లో పెరుగుతుందని చెప్పారు.
Telangana: గురుకులాలను పటిష్టం చేయాలి
పాఠ్యాంశాల్లోని సిలబస్‌తో పాటు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ తెలుసుకునేందుకు ఈ క్విజ్ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విజేతలకు కలెక్టర్ శుక్లా బహుమతులు అందజేశారు. ఎస్.చిరంజీవి, కె.మౌనిక (అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం జెడ్పీ హైస్కూల్) జిల్లా స్థాయి ప్రథమ స్థానం సాధించారని రిలయన్స్ సీఎస్‌ఆర్ హెడ్ పి.సుబ్రహ్మణ్యం తెలిపారు. వీరికి ఒక్కొక్కరికి రూ.40 వేల విలువైన రెండు ల్యాప్‌ట్యాప్‌లు బహూకరించామన్నారు. ద్వితీయ బహుమతి సాధించిన కె.సాత్విక్, ఆర్.వర్షిత(రావులపాలెం మండలం వెదిరేశ్వరం జెడ్పీ హైస్కూల్)లకు ఒక్కొక్కరికి రూ.20 వేల విలువైన రెండు ట్యాబ్‌లు అందజేశామని తెలిపారు.
Kala Utsav: జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు
ప్రైవేటు పాఠశాలల విభాగం నుంచి విజేతలుగా నిలిచిన 14 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.7 వేల విలువైన సైకిళ్లు అందించామన్నారు. ఈ క్విజ్ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 110 పాఠశాలలకు చెందిన 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రిలయన్స్ సంస్థ హెచ్‌ఆర్ హెడ్ వి.శ్రీనివాసరావు, క్విజ్ మాస్టర్ కమాండెంట్లు శ్రీనివాస్, షరీఫ్ పాల్గొన్నారు.