PM Appreciates HM: ప్రధాని ప్రశంసలు పొందిన పాఠశాల హెచ్ఎం.. కారణం?
Sakshi Education
తను చేసిన పనికి ఫలితంగా తాను ప్రధాని నుంచే ప్రశంసలు అందుకోవడంతో ఆ పాఠశాల హెచ్ఎం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు..
సాక్షి ఎడ్యుకేషన్: అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని ఆకేపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సీవీ.రమణయ్యశెట్టిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంశిస్తూ లేఖ పంపారు. ఈ విషయాన్ని రమణయ్యశెట్టి గురువారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలలో వర్చువల్‌గా పరీక్ష పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించగా సూచనలను తెలియచేసినందుకు ప్రధాన మంత్రి ప్రసంశిస్తూ లేఖ పంపడం ఆనందంగా ఉందని తెలిపారు.
➤ ABVP: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి
రాబోయే 25 ఏళ్లల్లో భారతదేశం అగ్రదేశంగా నిలిచేందుకు ప్రతిభావంతులైన యువతను దేశానికి అందించాల్సి ఉందని, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చి దిద్దుతారన్న నమ్మకం ఉందని పీఎం ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. హెచ్‌ఎంను పాఠశాల ఉపాధ్యాయులు సత్కరించారు.
Published date : 27 Oct 2023 02:49PM