Physical Education Teacher Training: నేటి నుంచి పీఈటీలకు శిక్షణ
Sakshi Education
రాయచోటి టౌన్: ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే క్రీడలపై పీఈటీలకు 18, 19 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అన్నమయ్య జిల్లా డీఈఓ శ్రీరాం శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలోని అన్ని ప్రభుత్వ, యాజమాన్య పాఠశాలలో పని చేస్తున్న పీఈటీలకు మైదుకూరులోని మేధా డిఫెన్స్ అకాడమీలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో 2022–2023 సంవత్సరానికి సంబంధించి ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఆడుదాం ఆంధ్ర, పాఠశాల సమాఖ్య క్రీడల తదితర అంశాలపై శిక్షణ నిర్వహిస్తారని చెప్పారు.
చదవండి: Collector MS Diwakar: ద్వితీయ పీయూ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..
Published date : 18 Aug 2023 03:41PM